రాజన్న సన్నిధికి రెండు లక్షల మంది రాక
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి ఉదయం స్వామివారికి స్థానాచార్యులు అప్పల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో మహాలింగార్చన నిర్వహించారు దాదాపు రెండు లక్షల మంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారు శివదీక్ష పరులతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది సాయంత్రం 6 గంటలకు మహా లింగా అర్చన జరిపారు భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు రద్దు చేసిన అధికారులు నిరంతరం లఘు దర్శనాలకు కొనసాగించారు అర్ధరాత్రి నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు చేశారు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ అఖిల్ మహాజన్ అడిషనల్ కలెక్టర్ గౌతమి పరిశీలించారు
No comments:
Post a Comment