బాల్కొండ మండలంలోని పాత జలాల్పూర్ గ్రామంలో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలు రెండో రోజు ఆదివారం కూడా కొనసాగాయి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలుతో పాటు యజ్ఞం నిర్వహించడం జరిగింది. శనివారం మొదటి రోజు జలాల్పూర్ గ్రామం నుంచి శ్రీ రంగనాథ స్వామి ఆలయం వరకు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. నేడు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం శ్రీ రంగనాథ స్వామి ఆలయ రంగంలో సోమవారం అనగా నేడు ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు
No comments:
Post a Comment