బోధన్ పట్టణంలోని నడివూరు చావిడి వద్ద నూతన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా రెండో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు శుక్రవారం రెండో రోజు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. పాడిపంటలు చల్లగా ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా బోధన్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బాగ రెడ్డి మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి మహా సంస్థానం పీఠాధిపతి హాజరుకానున్నారని పేర్కొన్నారు విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment