సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దర్శించుకున్నారు రాజ్ భవన్ నుంచి మోడీ ఉదయం 10. 10 నిమిషాలకు ఆలయం కి చేరుకున్నారు ఆయనకు వేద పండితులు ఎల్లంబట్ల రామకృష్ణ శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయంలో ప్రధాని నిమిషం పాటు అమ్మవారిని స్మరిస్తూ ధ్యానం చేశారు కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించే కానుకలు సమర్పించారు గర్భగుడిలో ప్రధాన అర్చకుడు రామతీర్థశర్మ వేద పండితులు వేణు మాధవ శర్మ ప్రధానికి వేదాశీర్వచనం చేశారు ఆలయ విశేషాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు ఆలయ చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని అమ్మవారి చిత్రపటాన్ని ఆయనకు అధికారులు అందించారు అమ్మవారి దర్శనం అనంతరం ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి సంగారెడ్డికి వెళ్లారు ఆలయ సందర్భంగా మోడీ సామాజిక మాధ్యమం ఎక్ష్సులో పంచుకున్నారు భారతీయులందరికీ ఆరోగ్యం శ్రేయస్సు సౌభాగ్యం సిద్ధించాలని సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ప్రార్థించాను అని పేర్కొన్నారు
No comments:
Post a Comment