రేపటి నుంచి ఏడుపాయల జాతర మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో ఈనెల 8 నుంచి 10 వరకు జాతర జరగనున్నది తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి సుమారు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా అందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నది వృద్ధులు దివ్యాంగులు పిల్లలు వెళ్లడానికి 8 మినీ బస్సులను ఏర్పాటు చేసింది విఐపి క్యూ లైన్లు బారికేళ్ళు తాగునీటి కుళాయిలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు
No comments:
Post a Comment