పురాణాల్లో ఒక కథ ఉన్నది .ఒకసారి భయంకరమైన క్షామం వచ్చింది. ఎక్కడా చుక్కనీరు లభించడం లేదు. అటువంటి సమయంలో గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో రోజు పిడికెడు ధాన్యాన్ని ఉదయాన్నే చల్లి.. తపస్సుకు కూర్చుంటే మధ్యాహ్న భోజన సమయానికి ఆ విత్తనాలు ఫలించి ఆశ్రమ వాసులకు సరిపడా ధాన్యం సమకూరేది .ఈ సంగతి తెలిసిన ఋషులు ఆ మహర్షికి ఇబ్బంది కలిగిస్తే ఆయన శివ భక్తుడు కాబట్టి గంగను శివుని జటాజూటం నుంచి భూమి మీదకు తీసుకొస్తాడని ఆలోచించారు. దాని ప్రకారం ఒక మాయాగోవు ని సృష్టించి గౌతముడు చేసిన పంట మీదకు ఉసిగొలిపారు. గౌతముడు గోవును గమనించి చేతిలోని దర్బను దాని మీదకు విసరగా ఆ గోవు మరణించింది. అప్పుడు ఋషులు గోహత్య ఎంత ఘోరమో తెలుసు కదా.. దాన్నుంచి బయటపడాలంటే పరమశివుని శిరస్సు నుంచి గంగను భూమి మీదకు రప్పించు ,అప్పుడే ఈ మహా పాపానికి ప్రక్షాళన అన్నారు గౌతముని తో.. అప్పడాయన తపస్సు చేసి శివున్ని మెప్పించాడు. ఈశ్వరుడి జటాజూటం నుంచి గంగ భూమిని పునీతం చేసింది. అదే గౌతమీనది. గౌతముడు ఎంత శక్తిమంతుడో, ఆయన గంగను భూమి మీదకు ఎలా తీసుకొచ్చాడో ఈ కథ తెలియచేస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి