Thursday, 29 February 2024

అమ్మవారి సేవలు

 నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆర్ అండ్ బి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారి మోహన్ నాయక్ దర్శించుకున్నారు వీరికి ముందుగా స్థానిక మాజీ సర్పంచ్ డి లక్ష్మణరావు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారి మోహన్ నాయక్ పూజ సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు వీరి కాలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి క్షేత్ర పర్యటనలో భాగంగా గ్రామంలోని బొర్రా గణేశా ఆలయం నుండి మహాలక్ష్మి ఆలయం శ్రీ పాప హరేశ్వర ఆలయం శ్రీ దత్తాత్రేయ ఆలయం నుండి సరస్వతి అమ్మవారి ఆలయం వరకు బైపాస్ సీసీ రోడ్డు రహదారి కొరకై ప్రత్యేకంగా ఆరు కోట్ల రూపాయల నిధులతో పనులు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఈ పనులు పూర్తయితే బాసర మండల కేంద్రానికి వచ్చే గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు



No comments:

Post a Comment