Thursday, 29 February 2024

ఘనంగా తిరుగువారం ముగిసిన మేడారం

 మేడారం మహా జాతర ముగిసింది అత్యంత వైభవంగా కొనసాగిన జాతర బుధవారం తిరుగు వారం పండుగతో ముగిసింది ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం వనదేవతలకు వడ్డెలు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు గద్దెలు గ్రామంలోని గుడిని శుద్ధి చేశారు ఆడపడుచులు అలుకు పూతలతో రంగురంగుల ముగ్గులు వేసి అమ్మవార్ల గద్దెలను అందంగా అలంకరించారు డోలు వాయిద్యాలు నడుమ తల్లులకు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు తిరుగుబారం రోజున కూడా తల్లులు ఇక్కడే కొలువుదీరి ఉంటారని నమ్మకంతో భక్తులు మేడారానికి పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తల్లులకు బంగారాన్ని సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు ఫిబ్రవరి 7న గుడి మెలిగే పండుగతో మొదలై 14న మండలిగే పండుగ 21 22 తేదీల్లో నా వనదేవతలు గద్దెలకు చేరడం 23న భక్తుల మొక్కులు 24న వనప్రవేశం కార్యక్రమాలు జరిగాయి



No comments:

Post a Comment