వివేకానంద యుక్త వయసులో ఉండగా తండ్రి విశ్వనాథ దత్త హఠాత్తుగా కన్నుమూశారు ఒక్కసారిగా కుటుంబం పేదరికంలో కురుకుపోయింది పెద్ద కుమారుడైన వివేకానందుడే ఆధారమయ్యాడు పట్టభద్రుడైన ఆయనకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు అలాంటి క్లిష్ట పరిస్థితులలో గురువు పరమహంస వద్దకు వెళ్లి బాధపంచుకున్నాడు అప్పుడు ఆయన సమీపానే ఉన్న దక్షిణేశ్వర కాళి ఆలయం వైపు చూపిస్తూ ఇవాళ మంగళవారం ఈరోజున అమ్మవారిని ఏది కొడితే అది అనుగ్రహిస్తుంది వెళ్లి ప్రార్థించు అన్నాడు ఆ సాయంత్రం వివేకానంద మందిరానికి వెళ్లి అమ్మను ప్రార్థించారు తిరిగి వచ్చాక రామకృష్ణుడు అమ్మ ఏమన్నది అని అడిగారు అరే అడగటం మర్చిపోయాను అని వివేకానంద మదనపడ్డారు. సరే మళ్ళీ వెళ్ళు అన్నారు పరమహంస ఈసారి అదే పద్ధతి మూడోసారి స్వామీజీ ఖాళీ ఆలయానికి వెళ్లి వచ్చాక ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా కనిపించారు పరమహంసను ఉద్దేశించి జగన్ మాతను డబ్బు కావాలని ఎలా అడగగలను? అలా చేస్తే మహారాజు దగ్గరకు వెళ్లి గుమ్మడికాయ అడిగినట్లు ఉంటుంది నిస్వార్ధ ప్రేమతో భక్తితో అమ్మను అర్థం చేసుకునే శక్తిని ఇమ్మని ప్రార్థించాను అన్నారు వివేకానంద కానీ అమ్మవారి కృప గురువుగారి ఆశీస్సులు ఫలంగా అప్పటినుంచి వివేకానంద కుటుంబానికి ఎలాంటి లోటు రాలేదు అవసరమైన వసతులకు ఇబ్బంది కలగలేదు
No comments:
Post a Comment