Tuesday, 19 March 2024

వన్నెల్ బీ లు వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ

 బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు సోమవారం ఉదయం ఉత్సవ మూర్తులు అభిషేకము నూతన వస్త్రాలంకరణ అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని గ్రామంలో ఊరేగించారు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి మొక్కలను తీర్చుకున్నారు ఉత్సవాల సందర్భంగా ఆలయంలో హోమం దేవత ఆహ్వానం కలశపూజ వంటి పూజలు నిర్వహించారు మంగళవారం జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు

No comments:

Post a Comment