26, సెప్టెంబర్ 2026, శనివారం

పరమశివుడు.. బ్రహ్మహత్య

 దేవతలకు సంబంధించి అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. విస్తృత ప్రచారంలో ఉన్న కథనాన్ని అనుసరించి ఒకసారి చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ఐదో తలను సృజించుకున్నాడు.

 అహంకారాన్ని సహించని పరమశివుడు బ్రహ్మ ఐదవ తలను ఖండించాడు. అయితే అలా చేయడం బ్రహ్మహత్య పాపం. ఆ దోషం వల్ల బ్రహ్మదేవుడు కపాలం శివుడు చేతికి అతుక్కుపోయి విడివడలేదు. దోషం తొలిగేవరకు శివుడు భిక్షాటన చేస్తూ తిరిగాడు. ఆయనలా సంచారం చేస్తూ కాశీనగరంలోకి ప్రవేశించిన వెంటనే కపాలం చేతి నుండి విడిపోయింది. కాశీ క్షేత్ర ఘనత అంతటిది. అందుకే దానిని మోక్షపురి అంటారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి