జక్రాన్ పల్లి మండలంలోని కలిగోట్ మరియు చింతలూరులో శుక్రవారం తాతాయి పండుగను ఇరు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఇరు గ్రామాలలో తాతాయికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండాలని, పంటలు బాగా పండాలని పాడి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు నాగుల శ్రీనివాస్, నాయకరాజు వీడిసి సభ్యులు, తాతాయి ఆలయ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి