13, ఫిబ్రవరి 2024, మంగళవారం

రేపు వసంత పంచమి వేడుకలు

 హిందూ కాలమానిని ప్రకారం వసంత పంచమి పండుగ సరస్వతి మాత జన్మదినం ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఐదో రోజున జరుపుకుంటారని ప్రముఖ కవి కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కంకణాల రాజేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో మీడియా ద్వారా తెలిపారు ఈ సంవత్సరానికి గాను ఫిబ్రవరి 14న అంటే బుధవారం రోజు వసంత పంచమి ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు సరస్వతి మాత పూజకు శుభ సమయం గా పండితులు పేర్కొంటున్నారు చదువుల తల్లి అక్షరాల అధిదేవత విద్యార్థి దేవత పుస్తక పాణిని జ్ఞాన వరప్రదాయని అయిన సరస్వతి దేవిని వసంత పంచమి రోజున పూజిస్తే చదువులో వచ్చే ఆటంకాలు తొలగిపోయి జ్ఞాపకశక్తి పెంపొంది తెలివితేటలు వృద్ధి చెందుతాయని హిందూ ధర్మ శాస్త్రం చెబుతుంది వివాహాది శుభకార్యాలకు వసంత పంచమిని తిరుగులేని రోజుగా అభిమానిస్తారు అందుకే ఈ వసంత పంచమి రోజున పిల్లలకు సరస్వతి సన్నిధిలో సరస్వతీ పూజారికాల్లో వేద పండితుల సమక్షంలో అక్షరాభ్యాసం చేయిస్తారు తల్లి సరస్వతి ఆశీస్సుల ద్వారానే ప్రజలు జ్ఞానం వాక్కు కళా జ్ఞానాన్ని పొందుతారు సరస్వతీ దేవి అనుగ్రహం ఉంటే చతుర్ షష్టి కళల్లో విజయం సాధించవచ్చు అని కంకణాల రాజేశ్వర అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి