మహాశివరాత్రిని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాలలో దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ ఆదేశించారు జిల్లా కేంద్రం నీలకంఠేశ్వరాలయంలో బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు ఎండలు పెరుగుతున్న తరుణంలో భక్తుల కోసం చలువ పందిర్లు షామియానాలు మంచినీటి వసతి రక్షణ కోసం పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు ఆయా దేవాలయాల ఈవోలు పూజారులు సిబ్బంది సేవా సంస్థల ప్రతినిధులు పూజలు సాఫీగా జరిగేలా చూడాలన్నారు ఆమె వెంట ఆ శాఖ పరిశీలకురాలు కమల ఈవో వేణు తదితరులు ఉన్నారు
No comments:
Post a Comment