బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మారుమూల గ్రామం మానాలలో కొలువుదీరిన శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినోత్సవాలలో భాగంగా శనివారం శివపార్వతుల కల్యాణోత్సవం కనుల పండుగ ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు మధుపూర్ణ చందు ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించగా ఆలయ కమిటీ అధ్యక్షుడు మూడారపు గంగారెడ్డి వీడీసీ చైర్మన్ గోపిడి రవీందర్ రెడ్డి కమిటీ పాలకవర్గ సభ్యులు స్వామివారి కల్యాణోత్సవ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు వీడిసి ఆలయ కమిటీ సభ్యులు స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు
No comments:
Post a Comment