ఆర్మూర్ మండలంలోని చేపూర్లో మహాశివరాత్రి ఉత్సవాల పోస్టర్లను శుక్రవారం ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్ ఆవిష్కరించారు మహాశివరాత్రిని పురస్కరించుకొని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు ఈనెల ఐదున ఆగు స్వామి మహారాజచే ఆశీర్వాద తీర్థ ప్రసాదాలు 6న కుంకుమార్చన ఏడున గణపతి పూజ పుణ్యాహవాచనము స్వామివారి ఊరేగింపు నగరే డప్పు కళాబృందం వారిచే ప్రదర్శన ఎనిమిదిన శివపార్వతుల కల్యాణోత్సవం 9న అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వీడిసి అధ్యక్షుడు రెక్కల గంగారెడ్డి కోశాధికారి దాసరి నాగరాజు తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బద్దం రాజు సురేష్ రుక్మాజి మాజీ ఎంపీటీసీ జల్లేపల్లి గంగాధర్ మాజీ సర్పంచ్ కుస్తాపురం గంగారెడ్డి శ్రీకాంత్ చరణ్ లింగ గౌడ్ శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment