యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆచార్యులు పూర్తి చేశారు పాంచానిక దీక్షతో చేపట్టే ఉత్సవాలలో మొదటి రోజైన మంగళవారం ఉదయం 10:30 గంటలకు స్వస్తి వాచనం జరిపిస్తారు ఆరవ తేదీన ధ్వజారోహణం భేరీ పూజ దేవత ఆహ్వానం అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తారు ఏడవ తేదీ రాత్రి 7 గంటలకు రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ఆలయ ఉత్తరం ఆడ వీధిలోని కళ్యాణ మండపంలో జరిపిస్తారు 8వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి అభిషేకాలు రాత్రి లింగోద్భావ కాలంలో మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం ,9వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు లక్ష బిల్వార్చన రాత్రి శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం 10వ తేదీన మధ్యాహ్నం పూర్ణాహుతి రాత్రి డోలోత్సవం ఉంటాయి దీనితో వేడుకలు ముగుస్తాయి
పూజలకు టికెట్లు
రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే ఆయా పూజలలో పాల్గొని భక్తులు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఏడవ తేదీన నిర్వహించే శివకళ్యాణోత్సవంలో 516 రూపాయలు టికెట్ కొనుగోలు చేసి ఇద్దరు పాల్గొనవచ్చు 8వ తేదీ మహాశివరాత్రి రోజున జరిపే అభిషేకంలో 300 రూపాయల టికెట్ రాత్రి జరిగే శత రుద్రాభిషేకంలో 516 రూపాయలు టికెట్టు కొనుగోలు చేసి పూజల్లో పాల్గొనాల్సి ఉంటుంది ఇక తొమ్మిదవ తేదీన జరిగే లక్ష బిల్వార్చన పూజలు సైతం పాల్గొనేందుకు 516 రూపాయల టికెట్ కొనుగోలు చేయాలి
No comments:
Post a Comment