30, సెప్టెంబర్ 2018, ఆదివారం

నడి రోడ్డుపై - కవిత

నడి రోడ్డుపై నాటు ఆయుధాలతో చెట్లను నరికినట్లు మనుషులను నరుకుతుంటే ఆపాల్సింది పోయి
అదేదో నయనానందకరమైన షో జరుగుతున్నట్లు నయా నయా ఫోనులతో నానా రకాలుగా వీడియోలు తీయడం ఏం సోయి
పరిస్థితులు ఏ క్షణమైనా తారుమారు అవుతాయనే ఇంగిత జ్ఞానం పోయి
మనుషులు తీస్తున్నారు వీడియోలు ,షేర్ చేస్తున్నారు వీడియోలు మతి చెడిపోయి
కఠినమైన చట్టాలు చేస్తేనే,కఠిన చర్యలు చేపడితేనే పూర్వపు చైతన్యం వస్తుంది ఈ దారుణమైన రోగం పోయి

25, సెప్టెంబర్ 2018, మంగళవారం

ఓటు - వెల్లడించును ప్రజల మనసులోని తిరుగుబాటు - కవిత

ఓటు - వెల్లడించును ప్రజల మనసులోని తిరుగుబాటు
ఓటు - నేతల బరువును తూచే తూకపు బాటు
ఓటు - నాయకులకు తెప్పించును తీవ్ర తలపోటు
ఆదమరిచి వ్యవహరిస్తే వేయును వేటు
ఓటు - పౌరుల చేతిలోని క్రికెట్ బ్యాటు
బాగా ఆడితే తెరువును సిక్సర్లకు బార్లా గేటు
కల్పించును విజేతల జాబితాలో చోటు
ఓటు - గుంటూరు మిర్చికంటే ఘాటు
సరిగా వాడితే అది అందించే రుచి ఎంతో గ్రేటు
ఓటు - ఎంతో మందిని చేయిస్తుంది సర్కస్ ఫీటు
ఒకే ఓటు మార్చివేయును ఎంతో మంది ఫేటు
ప్రతి పౌరుడు విధిగా తెలుసుకోవాలి ఎంతో విలువైనదని తన ఓటు
అలా తెలుసుకుని మెదులుకుంటేనే నిజంగా మీరు గ్రేటు.
ఓటు - మనందరికీ కల్పిస్తుంది అద్భుతమైన వెసులుబాటు
ఈ విషయమై ప్రతి ఒక్కరూ అలోచించాలి కొద్ది సమయం పాటు
అప్పుడే ఉండవచ్చు నిశ్చింతగా ఐదు సంవత్సరాల పాటు