11, సెప్టెంబర్ 2018, మంగళవారం

నటరాజ గంగాధరా - భజన

నటరాజ గంగాధరా
హే జటధారి గంగాధరా 2

అట జూడ నీవే ఇట జూడ నీవే
ఎటు జూసినా నీవే  2
ఘటమందు నీవే మఠమందు నీవే
విఠలాక్ష జగమంత నీవే కదా   " నటరాజ "

హే నాగభరణా నీ నామస్మరణా
నే మానలేదయ్యా  2
నానావిధంబుల గానంబు జేతూ
దీనావనా జాలి చూపించవా         " నటరాజ  "

కలవారలెన్నో కానుకలనిచ్చీ
కొలిచేరు ఓ దేవా 2
ఫలపత్రమైనా తేలేని నేనూ 2
పిలిచేను నా పిలుపు ఆలకించవా     " నటరాజ "

భువనేశ సకలా భూతేశ్వరా
హే భవబంధ పరిహారా 2
శివచంద్రశేఖర భవదీయదాసూ
కవి రామచంద్రుణ్ణి కాపాడవా       " నటరాజ "

నాటినావు పూదోటను నీవే - భజన

నాటినావు పూదోటను నీవే
తోటలోన ప్రతి చోటను నీవే  2

మొక్కలు కొన్ని వృక్షములాయె
వాడిన తీగలు మోడులు ఆయె
నీటితోనె ఈ తోట పెరుగగా
తోటమాలి ఈ లోటు ఎరుగడా     " నాటినావు "

పూలూ కాయలు ఊయలలూగే
గాలికి పూలు నేలకు రాలే 2
పూలు రాల పూ బాలలు నవ్వే 2
కాలగతిని వనమాలి తెలియడా    " నాటినావు "

పూవులు కొన్నీ పూజలకేగే
ప్రాప్తము లేనివీ పాడైపోయే 2
ఋణము దీరెనా ఏ జీవికైనా  2
తనువులు వదిలి తరలిపోవునులే    " నాటినావు "

చంద్రధరుని సేవించేటి
రామచంద్రుడు శ్రీ గురువాయే
వాడిన తీగై వనములనుండే
నీడ జూసి కాపాడగ రావే     " నాటినావు "