25, సెప్టెంబర్ 2018, మంగళవారం

ఈ జగమేలు జనని ఓ యమ్మా - భజన

ఈ జగమేలు జనని ఓ యమ్మా
మా బ్రతుకు బాట నీవమ్మా
కరమందు వీణ దాల్చావే
కమలంబులోన వెలిచావె     " ఈ జగ "

మా హృదయ కమల కుసుమం
నీ చరణాల పాదపీఠం
నీ నామ మధుర గానాలే
నిలిచేను ఇలలొ మా కొరకే   " ఈ జగ "

సంగీత కళల జనని
సర్వ లోకాలు బ్రోచె వాణీ
వేదాల వెలుగు నీ చలవే
వెలిసావు ఇలలొ మా కొరకే   " ఈ జగ "

కవులైన పండితులకు
తల్లి నీవేలె వారి బ్రతుకూ
ముక్కోటి దేవతా లోకం
మ్రొక్కేను ముదముతో నిత్యం   " ఈ జగ "

18, సెప్టెంబర్ 2018, మంగళవారం

తెల్లారినదీ లేరా స్వామీ పూజకు పూవులు పూచినవీ - భజన

తెల్లారినదీ లేరా స్వామీ పూజకు పూవులు పూచినవీ
సన్న జాజులూ బంతి పువ్వులూ వెంకటరమణని కొలచినవీ  " తెల్లా "

గొల్లలు పిల్లలు తలుపులు తెరువగ కర్పూర హారతి ఇచ్చెనులే
పరిమళాలు పంచామృతములతో చక్కటి స్నానము చేయరే   " తెల్లా "

మంగళ హారతి గైకొనుమా మా మానస మంగళ హారతీ
కర్పూర హారతి వెలుగులె నీకు ముత్యాల మంగళ హారతీ   " తెల్లా "

వెండి కొండపై నిండు మనసుతో కోయిల నీకై పాడెనులే
త్యాగయ్య గీతిక పదములె నీకూ ముత్యాల మంగళ హారతీ  " తెల్లా "