Wednesday, 27 March 2024

వైభవంగా లక్ష్మీ నరసింహుడి దక్షిణ దిగ్ యాత్ర

 జగిత్యాల జిల్లా ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం దక్షిణ దిగ్ యాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సంప్రదాయం ప్రకారం ఆలయానికి దక్షిణ దిశలో ఉన్న పోలీస్ స్టేషన్ ఆవరణలో పూజలు నిర్వహించారు


జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మంగళవారం అక్కడి పోలీస్ స్టేషన్ను సందర్శించారు స్టేషన్లోని రికార్డులను పరిశీలించిన అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు అందుకున్నారు స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్య ఘట్టమైన నరసింహుడి దక్షిణ దిగ్ యాత్రను మంగళవారం అంగరంగ వైభవంగా జరిపించారు ఇందులో భాగంగా ధర్మపురి పోలీస్స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ఉదయ్ కుమార్ నేతృత్వంలో అర్చకుల వేద మంత్రచారణల మధ్య ప్రత్యేక పూజలు జరిపించారు ఆలయం నుంచి శోభాయాత్రగా తరలి వెళ్లిన స్వామివారికి పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేక పూజలు జరిపారు స్వామి వారి కళ్యాణ అనంతరం దక్షిణ ఉత్తరలుగా బయలుదేరుతుంటారని మార్గమధ్యంలో ఉన్న పోలీస్ స్టేషన్ను లక్ష్మీనరసింహుడు సందర్శించి రికార్డులు రిజిస్టర్లను పరిశీలించి దుష్టులను శిక్షిస్తాడని ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం అని పండితులు తెలిపారు



తెలంగాణ తిరుమలలో రథోత్సవం

 తెలంగాణ తిరుమల దేవస్థానంలో సోమవారం పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు స్వామివారికి అర్చనలు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని మాడవీధులు ఊరేగించారు కమిటీ సభ్యులు నాగేశ్వరరావు అప్పారావు నరసరాజు రాజు హనుమంతరావు మేనేజర్ విట్టల్ తదితరులు ఉన్నారు



శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

 వాహన సేవలో పాల్గొన్న జస్టిస్ ఎన్వి రమణ దంపతులు

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మల్లప్ప స్వామి వారు గరుడ వాహనంపై ఆలయం మాడవీధుల్లో వివా విహరించి భక్తులను కటాక్షించారు గరుడ వాహన సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్ట్ ఎన్వి రమణ శివమాల దంపతులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు కార్యక్రమంలో శ్రీ చిన్న జీయర్ టీటీడీ న్యాయాధికారి వై వీర్రాజు జిల్లా ప్రోటోకాల్ న్యాయమూర్తి ఎం గురునాథ్ ప్రోటోకాల్ మున్సిపన్ న్యాయమూర్తి పి కోటేశ్వరరావు శ్రీవారి  ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు




Tuesday, 26 March 2024

ధర్మపురిలో వైభవంగా తెప్పోత్సవం

  జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ పుష్కరిణిలో సోమవారం సాయంత్రం ఉగ్ర నరసింహుడి తెప్పోత్సవం వైభవంగా జరిగింది ఉత్సవాలలో భాగంగా ఆరో రోజున ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బ్రహ్మ పుష్కరిని వరకు మంగళ వాయిద్యాల మధ్య తీసుకెళ్లారు కోనేరులో హంస వాహనంపై తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు అనంతరం భోగమండపంలోని కూయలపై స్వామివార్లకు డోలోత్సవం నిర్వహించారు ఈ వేడుకలు ఆచార్యులు అధికారులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిసిఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు




యాదాద్రిలో హోలీ సేవా

 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం హోలీ పండుగ సందర్భంగా ఆచార్యులు విశేష పూజలను నిర్వహించారు సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి ఆలయ తిరుమల వీధుల్లో ఊరేగించారు అనంతరం పడమటి రాజగోపురం ముందు గల వేంచేపు మండపంలో అధిష్టించే ప్రత్యేక పూజలు చేసి వేద పారాయణం చేశారు ఆలయ ప్రధాన అర్చకుడు కాండూరి వెంకటాచార్యులు హోలీ వేడుక విశేషాన్ని భక్తులకు వివరించారు పూజల తర్వాత శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులపై రంగులు చెల్లి ఆ తర్వాత భక్తులపై చెల్లారు ఈ వేడుకలు ఆలయ ఆచార్యులు అధికారులు భక్తులు పాల్గొన్నారు



రామయ్య పెళ్లి కొడుకు కాయని

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పెళ్లి వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు వేద పండితుల సతీమణులతో పాటు ఇవు రమాదేవి పసుపు కుంకు కొమ్ములు దంచే కార్యక్రమంతో పనులకు శ్రీకారం చుట్టారు ప్రతి ఏడాది పాల్గొన పౌర్ణమి రోజున ఈ వేడుకలు ప్రారంభించడం మానవాహితీ ముందుగా మేళా తాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూరలను ఉత్తర ద్వారం వద్దకు తీసుకువచ్చి ఆశీర్వది చేశారు ఆ తర్వాత ఆలయంలో వైభవంగా వసంతోత్సవం డోలోత్సవం నిర్వహించారు ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే జగత్ కళ్యాణం పనులను పాల్గొన పౌర్ణమి సందర్భంగా సోమవారం ఘనంగా ఆరంభించారు ఉత్తర ద్వారం వద్ద స్థానాచార్యులు స్థల సాయి నేతృత్వంలో రోలు రోకలికి దేవతలను అవగాహన చేసి పసుపు కొమ్ములు దంచారు మిథిలా మండపం వద్ద ఉంచిన బియ్యాన్ని తలంబ్రాలుగా సిద్ధం చేశారు కుంకుమ పసుపు సెంటు రోజు వాటర్ ను నేను ఈ కలిపి రామయ్య అక్షతలకు పరిమళాలను జోడించారు ఈ క్రతువులు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం బేడ మండపం వద్ద స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు



ఊరంతా గుద్దుకున్నారు

 హోలీ వేల రంగులు చల్లుకోవడం సహజం కానీ నిజామాబాద్ జిల్లా హుంసా గ్రామంలో పిడుగులాట ఆడుతారు సోమవారం ఒకరినొకరు పిడికిలి బిగించి కొట్టుకున్న జనం తర్వాత ఆ లింగనం చేసుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు


హోలీ పండుగ వేళ ఆనవాయితీ రెండు గ్రూపులుగా విడిపోయి బాదుకున్న హునసా గ్రామస్తులు

హోలీ పండుగ వేళ హున్స గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోయి పిడుగులు ఆడుకున్నారు 130 ఏళ్ల నుంచి మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం హుంసా గ్రామంలో ఇది ఆనవైదిగా కొనసాగుతోంది గ్రామం సుభిక్షంగా ఉండాలంటే మా పూర్వీకుల నుంచి దీనిని జరుపుకుంటున్నామని గ్రామ పెద్దలు తెలిపారు గ్రామం మధ్యలోని హనుమాన్ మందిరం ఎదుట సోమవారం వేదిక ఏర్పాటు చేశారు నాలుగైదు ఫీట్ల ఎత్తైన కర్ర స్తంభాలు పాటి మధ్యలో పొడవును గట్టి తాడు కట్టారు సాయంత్రం గ్రామ శివారులో కుస్తీ పోటీలు ముగించుకొని ఈ ఆటకు సిద్ధమయ్యారు గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోయి పిడుగులు అట ప్రారంభించారు సాయంత్రం 62 నిమిషముల నుంచి 15 నిమిషాల పాటు ఆట కొనసాగింది గ్రామ పెద్దల సూచన మేరకు ఆటను విరమించారు తదనంతరం ఇరుపక్షాల వారు ఆ లింగనం చేసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు బోధన్ ఎసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు

మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని కొంతనపల్లిలో సోమవారం హోలీ సంబరాలు ప్రత్యేకంగా జరుపుకున్నారు గ్రామంలోని ప్రధాన కూడలి వద్దకు గ్రామస్తులు చేరుకొని రెండు గ్రూపులుగా విడిపోయి తాడు కట్టిలాగా అనంతరం పరస్పరం పిడుగులు గుద్దుకున్నారు చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు



Monday, 25 March 2024

శివ కళ్యాణానికి రాజన్న ఆలయం ముస్తాబు

 27 నుంచి 31 వరకు జరగనున్న ఉత్సవాలు 28న కళ్యాణము

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 27న శివకళ్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి 31 వరకు ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాల కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే యాగశాలను సిద్ధం చేశారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుండగా వేములవాడ మాత్రం శివ మహాపురాణం ఆధారంగా కామ దహనం తర్వాత కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈనెల 28న అభిషేక లగ్న ముహూర్తాన ఉదయం 10:50 నుంచి 125 నిమిషముల వరకు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు కల్యాణం సందర్భంగా రాజన్న ఆలయం మున్సిపాలిటీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ముప్పయిన స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నారు ఈ ఉత్సవాలను వీక్షి ంచేందుకు లక్షలాదిమంది భక్తులతో పాటు జోగినిలు హాజరవుతారు ఒకవైపు శివుడి వివాహం జరుగుతుండగా జోగినులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని శివుడిని పెళ్లాడినట్లు తన్మయత్వం చెందుతారు ఐదు రోజులపాటు అభిషేకాలు పూజలు రద్దు శివ కళ్యాణం సందర్భంగా ఈనెల 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు ఆలయంలో నిత్య కళ్యాణం సత్యనారాయణ వ్రతం లింగార్చన అభిషేకం రద్దు చేయనున్నారు అలాగే కళ్యాణం రోజు చండీ సహిత రుద్ర హోమం టికెట్స్ భక్తులు సమర్పించే కోడెల టికెట్స్ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అని ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు



కనుల పండుగగా నరసింహుడు తెప్పోత్సవం

 



జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ఆదివారం సాయంత్రం బ్రహ్మ పుష్కరిణి కోనేరులో తెప్పోత్సవాన్ని కనుల పండుగ జరిపించారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బ్రహ్మ పుష్కరిణి వరకు మేళ తాళాల మధ్య తీసుకెళ్లారు కోనేరులో హంస వాహనంపై ఐదు ప్రదక్షిణలు చేయించారు అనంతరం భోగమండపంలోని ఊయలపై స్వామివారిలను ఆసీనులు చేసి డోలోత్సవం నిర్వహించారు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మంది వరకు భక్తులు తరలివచ్చారు కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్ ప్రభుత్వ విప్లరి లక్ష్మణ్ కుమార్ డిసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు



హ్యాపీ హోలీ 2024

 హోలీ పర్వదినం సందర్భంగా ఒడిశాలోని పూరి బీచ్ లో సుదర్శన్ పట్నాయక్ వేసిన సైకత శిల్పం



ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

 ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మండల కేంద్రమైన కుంటాలలోని శ్రీకృష్ణ ప్రాచీన దేవాలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా హరి ఓం సత్సంగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మహారాష్ట్రలోని చిక్కిలి గ్రామానికి చెందిన రెడ్డి మహారాజ్ భక్తుల గోపాలు ప్రవచనాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు



అంజన్న స్వాముల సన్నిధానానికి కూలర్లు అందజేత

 కుంటాల మండల కేంద్రమైన కుంటాలలోని అంజన్న స్వాములకు సన్నిధానంలో నందిపేట మండలంలోని జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నందగిరి అన్వేష్ కుమార్ అంజన్న భక్తులకు రెండు కూలర్లను విరాళంగా తన వంతుగా సహాయంగా అందజేశారు అంతేకాకుండా అంజన్న భక్తులకు బిక్షం ఏర్పాటు చేసి అన్నదానం చేశారు ఈ సందర్భంగా గురుస్వామి భుజంగం గణపతి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి పూజా కార్యక్రమాలు చేపట్టారు అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంజన్న స్వాములు గ్రామస్తులు పాల్గొన్నార



రంగులు మెరిసే నవ్వులు విరిసే

 


దేశవ్యాప్తంగా ఒకరోజు ముందే హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి ఆదివారం పశ్చిమ బెంగాల్లోని బాలుర్ ఘాట్ లో యువతులు ఇలా ఉత్సాహంగా రంగులు చ ల్కున్నారు



శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ

 శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాలను 22 మంది చిత్రకారులు వేయగా దీన్ని శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పేరుతో తిరుపతికి చెందిన శ్రీ కళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పుస్తకంగా రూపొందించింది ఈ పుస్తకాన్ని ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గీసిన బొమ్మ కూడా ఈ పుస్తకంలో ఉండడం ఆ దేవదేవుడి కృపయా అన్నారు కాకా బ్రహ్మానందం ఆదివారం ఉదయం బిజెపి బ్రేకులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డు ప్రసాదాలు అందజేశారు

భక్తులతో కిటకిటలాడిన యాదగిరి క్షేత్రం

 



యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడు చిత్రంలో ఆదివారం భక్తుల కులాహారం నెలకొంది వారాంతపు సిలవ రోజు కావడంతో ఇష్టదైవం దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ప్రత్యేక ధర్మదర్శన క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి ఉచిత దర్శనం దర్శనానికి మూడు గంటలు వీఐపీ టికెట్ దర్శనానికి గంట సమయం పట్టింది క్యూ కాంప్లెక్స్ లోని ఏసీలు పనిచేయకపోవడంతో ఒక్క పూసలతో భక్తులు ఇబ్బందులు పడ్డారు 30 వేల మంది భక్తులు లక్ష్మీనరసింహుడిని దర్శించుకోగా వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు 55 లక్షల 3896 రూపాయలు ఆదాయం సమకూరిందని ఈవో ఏ భాస్కరరావు తెలిపారు ఎండలు మండుతుండడంతో కొండపై భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఉపశమనం కోసం అధికారులు చలువ పందిళ్ళను ఏర్పాటు చేస్తున్నార




భద్రాద్రి లో నేడు డోలోత్సవం వసంతోత్సవం

 భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం దోలోచవం వసంతోత్సవం నిర్వహించనున్నారు ఆదివారం గోదావరి నుంచి తీర్థ బిందెను తీసుకొచ్చి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి డోలోత్సవం వసంతోత్సవాలకు అంకురార్పణ చేశారు డోలోత్సవం వసంతోత్సవం నిర్వహించే సోమవారం నిత్య కళ్యాణాన్ని నిలిపివేయనున్నారు దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 9 నుంచి శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా ఏప్రిల్ 17న స్వామివారికి కల్యాణం నిర్వహించనున్నారు కాదా శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి వినియోగించే తలంబ్రాలు తయారీకి సోమవారం శ్రీకారం చుట్టం అన్నారు దేవస్థానం వైదిక సిబ్బంది వారి సతీమణులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను అన్నారు గత ఏడాది 250 కుంటాల తలంబ్రాలు సిద్ధం చేయగా ఈసారి 300 కుంటల తలంబ్రాలను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు ఇదిలా ఉండగా భద్రాద్రి రామయ్య కళ్యాణం సందర్భంగా తలంబ్రాల తయారీ కోసం జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవాసమితి భక్త బృందం 128 క్వింటాళ్ల బియ్యాన్ని భద్రాచలం కు తీసుకొచ్చింది ఈ బియ్యాన్ని దేవస్థానం అధికారులకు అందజేసింది

దగడు సేటు వినాయకుడి కి ద్రాక్ష మహోత్సవం

 



హోలీ సంబరాల వేళ మహారాష్ట్రలో విఘ్నేశ్వరాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు పూణేలో కొలువైన దగడు సేట్ వినాయక ఆలయాన్ని రంగురంగుల ద్రాక్ష పండ్లతో ముస్తాబు చేశారు ఇందుకోసం దాదాపు 2000 కిలోల ద్రాక్ష పనులను వినియోగించారు ఆలయ ప్రాంగణాన్ని నలుపు ఆకుపచ్చ ద్రాక్షలతో సుందరంగా తీర్చిదిద్దారు సంకటహర చతుర్థి రోజున ద్రాక్ష మహోత్సవము వేడుకగా జరుపుకోవాలని ఇక్కడ ఆనవాయితీ సహ్యాద్రి ఫామ్స్ ఆధ్వర్యంలో తీర్చిదిద్దిన అద్భుతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామి వారి వద్ద ఉంచిన ద్రాక్ష పనులను ససూన్ ఆసుపత్రి పితాశ్రీ వృద్ధాశ్రమం తో పాటు పలు సంస్థలకు భక్తులకు పంపిణీ చేస్తారు.



రాజాం రచయితల వేదిక 110వ సమావేశం

 ఈనెల మార్చి 31వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్ పాఠశాలలో రాజాం రచయితల వేదిక ఒక వంద పది వ సమావేశం జరుగుతుంది రాజాకు శాంతారావు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో వేమన ప్రగతి శీలత అనే అంశంపై బొంతు సూర్యనారాయణ ప్రవాహి ముఖ్య ప్రసంగం చేస్తారు

గారా రంగనాథం 9885758123

ముగిసిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

 తిరుమలలో ఐదు రోజులపాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి చివరి రోజు రాత్రి శ్రీ మల్లప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తిప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నాలుగు మాడవీధులలో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు రాత్రి 7 గంటలకు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తిప్పపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మల్లప్ప స్వామి వారి ఆశీనులై పుష్కరణలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు మంగళ వాయిద్యాలు వేద పారాయణం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తిప్పోత్సవమ్ నేత్రపర్వంగా  సాగింది

Friday, 22 March 2024

వేడుకగా రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి తెప్పోత్సవం

 తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా రెండో రోజు గురువారం రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి వారు తిప్పలపై భక్తులకు అభయం ఇచ్చారు ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడవీధులలో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తిప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరణలో ముమ్మార్లు వివరిస్తూ భక్తులను కటాక్షించారు వేదంగానం నాదం మధ్య అతిపోత్సవం వేడుకగా జరిగింది మూడోరోజు శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామి వారు తిరుచిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై ముమ్మార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు

24 25 తేదీలలో తుంబూరు తీర్థ ముక్కోటి

తిరుమల శ్రీ తుంబూరు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24 తేదీలలో ఘనంగా జరగనుంది తీర్థానికి విశేషంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది ఇందులో భాగంగా తుమ్మూరు తీర్థానికి మార్చి 24వ తేదీ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు 25వ తేదీ ఉదయం ఐదు నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు పాప వినాశనం వద్ద భక్తులకు అల్పాహారం అన్న ప్రసాదాలు తాగునీరు అందిస్తారు ప్రథమ చికిత్స కేంద్రాలు అంబులెన్స్ మందులు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండడంతో గుండే శ్వాస పోష సమస్యలు స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు భక్తులు వంట సామాగ్రి కర్పూరం అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది పోలీసు అటవీశాఖ టిటిడి విభాగం సమన్వయంతో భద్రత చర్యలు చేపట్టనున్నారు



సుఖమే దుఃఖం

 దహింపబడతాను అని తెలియక పురుగు అగ్నిలో పడి చస్తుంది. చస్తాను అని తెలియక గాలానికి ఉన్న ఎర్రని తిని చేప తన ఆయుష్షు పోగొట్టుకుంటుంది కానీ మనం మాత్రం తెలిసి తెలిసి కొన్ని వ్యామోహాలలో చిక్కుకొని కొన్ని తప్పుదారుల్లో నడిచి తినాశనం కొని తెచ్చుకుంటాము తరచి చూస్తే మనం ఏవి సుఖాలని వెంటపడతామో అదే అసలు దుఃఖాలుగా గ్రహించేసరికి జీవితం ముగిసిపోతుంది

ముసలితనం పెద్ద పులి వలే భయపెడుతూ మనపై పడుతుంది రోగాలు శత్రువుల శరీరాన్ని కబళిస్తాయి రంద్రం పాడిన కుండలోని నీరుల ఆయువు తరిగిపోతుంది లోకం శోకహతం అని తెలిసినప్పటికీ ఆశా పాశంతో జీవితం ముడిపడి మనం తప్పుదారిని విడవడం లేదు మనకు కోరికలు తీరుతున్న కొద్ది ఇంకా ఇంకా అనుభవించాలి పొందాలి అనే కృష్ణ ఏర్పడుతుంది కృష్ణుని పారద్రోహి తృప్తిని పెంచుకున్న మానవుడు నిత్యానందాన్ని అనుభవిస్తాడు సంతృప్తిని మించిన సౌభాగ్యం లేదు తృప్తిని పొందని మనుజుడు సప్త దీపమునైన చక్కబడడు అని పోతున చెప్పారు భక్తి సజ్జన సాంగత్యం మాత్రమే మనిషికి సంతృప్తిని శాంతిని ఇవ్వగలవు

కవిత్వం బడుగు జీవుల జీవనానికి అద్దం పట్టాలి

 కవిత్వం బడుగు జీవుల సమకాలీన జీవనానికి అద్దం పట్టాలని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు సిరిసిల్ల గఫూర్ శిక్ష కన్నారు. ప్రపంచ కవిత్వా దినోత్సవం సందర్భంగా గురువారం తెరవే ఆధ్వర్యంలో కవి సమ్మేళన నిర్వహించారు ప్రతి ఏడాది మార్చి 21న నిర్వహిస్తున్న ప్రపంచ కవిత్వ దినోత్సవాన్ని కవులకు ఇచ్చే గౌరవంగా భావించాలన్నారు ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాలమిస్టు డాక్టర్ జి లచ్చయ్య మాట్లాడుతూ తమ సమాజ వాగు కోసం కవులు రచయితలు రచనలు చేయాలని కవులకు దిశా నిర్దేశం చేశారు పలువురు కవులు కవిత గానం చేశారు తెరవే ప్రతినిధులు అల్లి మోహన్ రాజ్ మండపేట కాసర్ల రామచంద్రం లకులాభరణం సుధాకర్సు రేష్ తదితరులు పాల్గొన్నారు



నేత్రపర్వంగా ధర్మపురి నరసింహుడు కళ్యాణం

 జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి రెండో రోజు అయిన గురువారం ఆలయంలోని శేషప్ప వేదికపై యువ శ్రీనివాసా ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండుగ జరిపించారు ప్రభుత్వం తరఫున కలెక్టర్ యాస్మిన్ భాష పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 50000 మంది భక్తుల తరలివచ్చారు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వేడుక జరిపించారు ఎస్పీ సానుప్రీత్సింగ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విడ్మూరు లక్ష్మణ్ కుమార్ జాయింట్ కలెక్టర్ రాంబాబు డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు



25న రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం

 భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి ఏప్రిల్ 17న శ్రీరామనవమి 18న పట్టాభిషేకం మహోత్సవం జరగనున్నాయి ఈనెల 25న పెళ్లి పనులకు శ్రీకారం చుట్టానున్నారు ఉత్తర ద్వారం వద్ద సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచుతారు తలంబ్రాలు కలిపే క్రతువును ప్రారంభిస్తారు అదే రోజు హోలీ రావడంతో వసంతోత్సవం డోలోత్సవం నిర్వహించనున్నారు



సుమారు 200 క్వింటాల తలంబ్రాలు భక్తులు పవిత్రంగా భావించే స్వామి వారి తలంబ్రాలను గత ఏడాది 180 క్వింటాలు తయారు చేశారు ఈ ఎడారి 200 క్వింటాల మేర కలిపి ఎందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు వీటిని నవమ రోజున ప్రత్యేక కౌంటర్ల ద్వారా భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడమే కాక ముత్యాలతో కూడిన తలంబ్రాలను విక్రయిస్తారు శ్రీరామనవమి పనులకు టెండర్లు పూర్తికాగా వాటిని ప్రారంభించాల్సి ఉంది ఈ అంశంపై భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆలా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు కాగా ఏటా ఉగాది రోజుల ముఖ్యమంత్రి గవర్నర్కు శ్రీరామనవమి పట్టాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికలను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆహ్వాన పత్రిక అందజేసిన సీఎం వస్తారా లేక ఉన్నతాధికారులు హాజరవుతారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది కాగా ఏప్రిల్ 9 నుంచి 23వ తేదీ వరకు దేవస్థానంలో వసంతపక్ష ప్రీయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ నవాహానికి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి


ముగిసిన నరసింహుడు బ్రహ్మోత్సవాలు

 చివరి రోజున అష్టోత్తర శతఘటభిషేకం డోలోత్సవం నీటి నుంచి ఆర్చిత సేవలు పునరుద్ధరణ



యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి చివరి రోజు ప్రధాన అర్చకులు నల్లని తీగల లక్ష్మీ నరసింహ చార్యులు కాండూరి వెంకటచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రధానాలయ ముఖ మండపంలో 108 కళాశాలను పేర్చి మంత్రోచ్ఛారణలు పారాయణాలు యాగ్నీకులు రుత్వికుల మూలమంత్ర మూర్తి మంత్ర హోమాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయా కలశాల్లోని మంత్రజలంతో స్వామివారి అభిషేకం చేశారు సాయంత్రం నిత్య ఆరాధనలు ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు స్వామివారి బ్రహ్మోత్సవం జరిపారు అనంతరం అర్చక బృందం పేద పండితులు పారాయణికులు రుత్వికులు ఆలయ సిబ్బంది పోలీసులు జర్నలిస్టులను సన్మానించి స్వామివారి ప్రసాదం అందజేశారు కార్యక్రమాలలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఈవో భాస్కరరావు డిప్యూటీఈవో దోర్బాల భాస్కర్ శర్మ ఏఈవోలు గజవెల్లి రఘు గట్టు శ్రావణ్ కుమార్ సూపర్ అంటే దొమ్మాట సురేందర్ రెడ్డి పాల్గొన్నారు



నేటినుంచి ఆర్జిత సేవలు షురూ

బ్రహ్మొత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుంచి రద్దు చేయబడిన స్వామి వారి ఆర్జిత సేవలు శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు సుదర్శన నరసింహ హోమం బ్రహ్మోత్సవ పూజలు యధావిధిగా జరుగుతాయని ఆలయ ఆఫీసర్లు తెలిపారు

Thursday, 21 March 2024

కరపత్రాలు ఆవిష్కరణ

 కవిత్వ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాశాల ఆవరణలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కవిత్వ లక్షణాలు ప్రయోజనాలు తెలియజేసే కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవి నిజాయితీగా ఉండి ప్రజల బాధలకు తన రచనల ద్వారా పరిష్కార మార్గం చూపాలని కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండాలని కవితాను మేల్కొంటూ ఇతరులను మేల్కొల్పుతాడని అన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రతినిధులు మందపితాంబ పెనిశెట్టి గంగా ప్రసాద్ కార్యదర్శి మోహన్ రాజ్ నాగభూషణం కాసర్ల రామచంద్రం వకులాభరణం సుధాకర్ చంద్రకాంత్ పాల్గొన్నారు



Tuesday, 19 March 2024

రేపటి నుంచి సాలకట్ల తిప్పోత్సవాలు

 తిరుమలలో శ్రీవారి సాలకట్ల తిప్పోత్సవాలు ఈనెల 20 నుంచి 24 వరకు జరగనున్నాయి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరణలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇస్తారు తెప్పోత్సవాలు తొలిరోజు బుధవారం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమీపంగా శ్రీరామచంద్రమూర్తి తిప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు ఇక రెండో రోజు రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు మూడవరోజు శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామి వారు మూడుసార్లు పుష్కరణీ నీ చుట్టూ భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా శ్రీ మల్లప్ప స్వామి వారు నాలుగో రోజు ఐదు సార్లు చివరి రోజు 24న ఏడుసార్లు తిప్పపై పుష్కరణలో విహరించి భక్తులను కటాక్షిస్తారు ఈ తిప్పోత్సవాల కారణంగా ఈనెల 2021 వ తేదీలలో సహస్ర దీపాలంకార సేవ 22 23 24వ తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది



గులాల్ గోట బంతులు

 హోలీ పండగకు ముందు సోమవారం జైపూర్లో పర్యావరణ అనుకూల కలర్ పౌడర్ తో చేసిన గులాల్ కోట బంతులను సిద్ధం చేస్తున్న మహిళలు



ఆలయ సత్రం నిర్మాణానికి భూమి పూజ

 బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో దుర్గామాత ఆలయ సత్రం నిర్మాణానికి గ్రామస్తులు సోమవారం భూమి పూజ నిర్వహించారు ఈ సత్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నిర్ల నరసింహులు మంద శ్రీనివాస్ పర్వారెడ్డి మన్నే చిన్న సాయిలు గోపనపల్లి సాయిలు తదితరులు పాల్గొన్నారు

మాందాపూర్ లో పెద్దమ్మ పండుగ

 బిబిపేట మండలంలోని మాందాపూర్ గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి పండుగను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు మంగళవారం గ్రామ దేవత అయిన పోచమ్మకు బోనాలు బుధవారం పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం బోనాలు సమర్పిస్తారు గురువారం బండ్ల ప్రదర్శన తిరుగు బోనాలు అన్న ప్రసాద వితరణ ఒగ్గు కథలు ఉంటాయని తెలిపారు

దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపనలు

 ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటారుమూరులో శివ పంచాయతన సహిత హనుమాన్ దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి నాలుగు రోజులపాటు జరగనున్న ఉత్సవాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు విగ్రహాల ఊరేగింపు అనంతరం ప్రత్యేక పూజలు యజ్ఞం నిర్వహించారు బుధవారం శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ చేతుల మీదుగా శివ పంచాయత నవగ్రహ ధ్వజ శికర సహిత హనుమాన్ దేవత మూర్తులు యంత్రస్థాపన మూర్తుల ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షుడు ఇత్తడి గంగారెడ్డి కోశాధికారి తిరుపతి గౌడ్ ప్రధాన కార్యదర్శి గడ్డి కార్తీక్ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు

వన్నెల్ బీ లు వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ

 బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు సోమవారం ఉదయం ఉత్సవ మూర్తులు అభిషేకము నూతన వస్త్రాలంకరణ అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని గ్రామంలో ఊరేగించారు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి మొక్కలను తీర్చుకున్నారు ఉత్సవాల సందర్భంగా ఆలయంలో హోమం దేవత ఆహ్వానం కలశపూజ వంటి పూజలు నిర్వహించారు మంగళవారం జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు

ఆన్లైన్లో కొమురవెల్లి ఆర్జిత సేవలు

 కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆర్జిత సేవలను ఆన్లైన్లో బుక్ చేసుకుని సదుపాయం అందుబాటులోకి వచ్చింది దీనితో ఆర్చిత సేవలు టికెట్ల కోసం భక్తులు గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన అవస్థ తప్పింది ఆలయంలో రోజు నిర్వహించే మొక్కుబడును అర్జిత సేవలు 25 రకాలుగా ఉన్నాయి అందులో 12 సేవలను టీ యాప్ లో పొందుపరిచారు

ఇంద్రకీలాద్రిపై బఫే పద్ధతితో అన్న ప్రసాదం

 ఇంద్రకీలాద్రిపై బఫే పద్ధతితో అన్న ప్రసాదం

శుక్ర శని ఆదివారాల్లో అందించాలని నిర్ణయము మహా మండపం మొదటి అంతస్తులు ఏర్పాట్లు

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ అన్న ప్రసాదం అందాల అధికారులు చర్యలు చేపట్టారు క్యూ లైన్ లో వేచి ఉండకుండా నేరుగా ప్రసాద వితరణ హాల్లోకి చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నిత్యము అమ్మవారి దర్శనానికి సుమారు 30 వేల నుంచి 40000 మంది విచ్చేస్తుంటారు వీరిలో అత్యధికులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారే సాధారణ రోజులలో 4000 మందికి శుక్ర శని ఆదివారాలు రోజుకు 5000 మందికి అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నారు మహా మండపం రెండవ అంతస్తులు రెండు హాల్స్లో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది రాంబాబు అన్నదానం వితరణను పరిశీలించిన క్రమంలో పలువురు భక్తులు తమ ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువచ్చారు మహా మండపం మొదటి అంతస్తులు పద్ధతిలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన రావడంతో పాటు దానిని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఒకదాఫా 100 మంది చొప్పున రోజుల 1500 మందికి అన్న ప్రసాదం అందించే వీలు కలుగుతుందని అంచనా వేస్తున్నారు ఈ వారమే దీని అమలు చేయాలని నిర్ణయించారు

వైభవంగా లక్ష్మీనరసింహుడు కల్యాణ మహోత్సవం

 



అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగతి రక్షకుడైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది వార్షిక బ్రహ్మోత్సవాలలో 1059 నిమిషములకు మాంగల్య ధారణ జరిగింది అనంతరం స్వామి అమ్మవార్లకు తలంబ్రాల కార్యక్రమం నిర్వహించి దంపతులను ఒకచోటకు చేర్చారు జయజయ నారసింహ జయ నరసింహ నమో నరసింహ అంటూ భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి భక్తి పరవశ్యంలో మునిగి తేలారు. స్వామివారి కల్యాణోత్సవంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ బీర్ల ఐలయ్య అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఆలయ ఈవో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు






Monday, 18 March 2024

మెంట్ రాజు పల్లి లో బోనాల ఊరేగింపు

 డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి గ్రామంలో ఆదివారం పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకొని గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు బోనాలు ఉన్నాయి వేద్యాలు సమర్పించుకున్నారు ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని మొక్కలు తీర్చుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు



వన్నెల్ బి లో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

 బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం ఉత్సవ మూర్తులకు అభిషేకం మండలారాధన సుదర్శన యాగం పంచామృతాలతో అభిషేకం స్థాపితదేవతల భవనం చేపట్టారు ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలతో మొదటి రోజు ఉత్సవాలు నిర్వహించారు బ్రహ్మోత్సవాలలో భక్తులు గ్రామస్తులు పాల్గొని స్వామి వారికి పూజ నిర్వహించారు



ఘనంగా ఆలయ వార్షికోత్సవం

 నవీపేట మండలంలోని బీనోలలో ముత్యాలమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకం యజ్ఞం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం మహిళలు తలపై బోనాలను ఎత్తుకుని ఆలయానికి తరలి వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు పాడిపంటలు చల్లగా ఉండాలని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు



ముగిసిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం

 కమలేష్ పటేల్ కు ప్రపంచశాంతి రాయబారి పురస్కారం కమలేష్ ద్వారా ఆధ్యాత్మిక ఉద్యమం మరింత ప్రకాశించాలి జగదీబ్ ధనికడ్ మహోత్సవంలో పాల్గొన్న వందకు పైగా దేశాల యోగా అభ్యాసకులు

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం ఆదివారం తో ముగిసింది ఈ సందర్భంగా కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ జనరల్ సెక్రెటరీ బ్యాటరీ షియా ఈ మహోత్సవ నిర్వాహకుడు కమలేష్ డి పటేల్ కు ప్రపంచ శాంతి రాయబారి పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి ఘనకాడ చేతుల మీదుగా అందజేశారు శాంతి మార్గాన్ని అన్వేషించాలని సంకల్పించడం అందులో దేశవ్యాప్తంగా అన్ని కులాలు మతాల వారిని ఒకే వేదిక పైకి తీసుకురావడం అభినందనీయమని ధనకాడ అన్నారు కమలేష్ ద్వారా ఆధ్యాత్మిక శాంతి ఉద్యమం మరింత ప్రకాశించాలని 160 దేశాలలోని జీవితాలను తాకిన ఈ ఉద్యమం తప్పనిసరిగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కాగా ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో 100కు పైగా దేశాలకు చెందిన వేలాదిమంది యోగ అభ్యాసకులు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన లక్షకు పైగా ప్రజలు కులమతాలకు అతీతంగా పాల్గొన్నారు ఈ నెల 15న రాష్ట్రపతి ద్రౌపది 16 17 వ తేదీలలో ఉపరాష్ట్రపతి ఘనకాడ మహోత్సవంలో పాల్గొని పలు సూచనలు చేశారు అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు దేశ రాష్ట్ర ఉన్నతాధికారులు వివిధ మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు విద్యార్థులు హాజరయ్యారు మహోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రదర్శనలు ధ్యానం యోగ సాధన వంటి కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి



రామప్ప ఆలయ శిల్పకళ అద్భుతం

 యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక ఆరాధి దంపతులు సందర్శించారు వీరితోపాటు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి వినోద్ కుమార్ జస్టిస్ కే లక్ష్మణ్ జస్టిస్ అండ్ రాజేశ్వరరావు ఉన్నారు వీరందరికీ ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు రామలింగేశ్వర స్వామికి జస్టిస్ ఆరాధ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాన న్యాయమూర్తి దంపతులను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ఈవో బిల్ల శ్రీనివాస్ ఘనంగా సన్మానించి ఆలయ చిత్రపటాన్ని బహూకరించారు అనంతరం టూరిజం గైడ్లు ఆలయ చరిత్రను శిల్పకళా సంపదను గురించి న్యాయమూర్తులకు వివరించారు ఆలయ శిల్పకళా అద్భుతం అని సందర్శకుల పుస్తకంలో జస్టిస్ అలోక రాజ స్వయంగా రాశారు హైకోర్టు రిజిస్టార్లు నందికొండ నరసింహారావు ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి ములుగు జిల్లా జడ్జి పీవీ లలితా శివజ్యోతి జడ్జిలు మాధవి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు



భక్తులకు అపరిమితంగా శ్రీవాణి టికెట్లు జారీ

 ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శనివారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసింది దీనితో వీఐపీ భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమలలోని జేఈవో కార్యాలయం రేణిగుంట విమానాశ్రయంలో 10500 చెల్లించిన వారికి శ్రీవాణి టికెట్లు అపరిమితంగా ఇస్తున్నట్లు అనధికార సమాచారం ఉన్నతాధికారుల ఆదేశాలతో తిరుమల జేఈవో కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వరకు 72 విమానాశ్రయంలో 175 టికెట్లు జారీ చేశారు

పెళ్ళికొడుకు అయిన నరసింహ స్వామి






 యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఆదివారం రాత్రి శ్రీ స్వామివారి ఎదుర్కోలు మహోత్సవాన్ని ఆలయ ఆచార్యులు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవంగా జరిపించారు ఉదయం ప్రధాన ఆలయ మాడవీధుల్లో శ్రీ స్వామి వారు జగన్మోహిని అలంకార సేవలు భక్తులకు దర్శనం ఇచ్చారు ఇక సాయంత్రం శ్రీ స్వామి వారు అశ్వ వాహనంపై పెండ్లి కొడుకుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై అమ్మవారిని సేవోత్సవంగా ఆలయం మాడవీధులు ఊరేగించారు అనంతరం ఆచార్యులు అధికారులు స్వామివారి పక్షాన అమ్మవారి పక్షాన చేరి గుణగణాలను చర్చించుకున్నారు శ్రీ నరసింహ స్వామికి లక్ష్మీదేవితో వివాహం జరిపేందుకు ముహూర్తాన్ని ఆచార్యులు నిర్ణయించారు

తిరు కళ్యాణోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి 8:45 నిమిషాలకు గజవాహనంపై శ్రీ స్వామి ప్రత్యేక పల్లకిపై అమ్మవారు ఆలయం మాడవీధుల్లో ఊరేగికి 915 నిమిషములకు ఉత్తర దిశలోని రథశాల ముందు ఏర్పాటు చేసిన కళ్యాణ మండపానికి చేరుకుంటారు ఆ తర్వాత శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ వేడుకను ఆచార్యులు వేద పండితులు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వేదమంత్రాలతో ప్రారంభిస్తారు తులా లగ్న ముహూర్తంలో రాత్రి  నిమిషములకు 9.37 నిమిషములకు శ్రీ స్వామి వారు అమ్మవారికి మాంగల్య ధారణ చేయనున్నారు ఇక ఉదయం శ్రీ స్వామి వారు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవ పై ఊరేగనున్నారు కళ్యాణానికి టీటీడీ పరిస్థితి వస్త్రాలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుణాల ఉత్సవాలకు టీటీడీ తరఫున ఆదివారం పట్టు వస్త్రాలను అందజేశారు ఉదయం టీటీడీకి చెందిన ఉపకార్య నిర్వహణ అధికారి లోకనాథం ఆదివారం మెల్ చాట్ పట్టు వస్త్రాలను తీసుకొని ఆలయమాల వీధిలో ఊరేగింపుగా వచ్చారు జగన్మోహిని అలంకార సేవ ముందు పట్టు వస్త్రాలను ఆలయ ఈవో భాస్కరరావు అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి ప్రధాన అర్చకులకు అందజేశారు



యాదాద్రి స్వామికి వాహన సేవలు బహుకరణ

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సేవలో వినియోగించే వాహన సేవలు బంగారు మయంగా మారనున్నాయి హైదరాబాద్కు చెందిన ఒక దాత గజా గరుడ శేష వాహనాలను పంచలోహంతో తయారు చేయించి ఆదివారం యాదాద్రి ఆలయానికి తీసుకువచ్చారు తమిళనాడులోని మహాబలిపురంలో రవీంద్రన్ స్థపతి ఆధ్వర్యంలో వివాహనాలు ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి వీటిని శిల్పులు యాదాద్రి కి తీసుకురావడంతో ఆలయ ప్రధాన అర్చకులు పరిశీలించారు ఆయన సూచనల మేరకు గజ గరుడ శేష వాహన సేవలను తిరిగి మహాబలిపురం తీసుకెళ్లి బంగారు తాపడం పనులు చేయనున్నట్లు తెలిసింది 20 రోజుల తర్వాత దాత ఆలయ అధికారులు ఆచార్యులకు అందజేయనున్నట్లు సమాచారం