Friday, 15 March 2024

అంగరంగ వైభవంగా శ్రీ కోట మైసమ్మ సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షికోత్సవ వేడుకలు

 బోధన్ పట్టణంలోని బసవతారక నగర్లో గల ఆలయ వ్యవస్థాపకులు పసులోటి గోపి కిషన్ ఆధ్వర్యంలో గురువారం శ్రీ కోట మైసమ్మ సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి 12వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ బాలయోగి పిట్ల మహారాజ్ హాజరయ్యారు వేద పురోహితులతో ఉదయం నుండి స్వామివారికి అర్చన అభిషేకం మంగళహారతులు హోమం పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఊరేగింపు ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌతమ్ నరేష్ దంపతులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు


No comments:

Post a Comment