యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనుబంధమైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో రెండో రోజైన బుధవారం శివాలయం ముఖమండపంలో హోమాన్ని నిర్వహించి వేద పారాయణాలు మంత్రోచ్ఛారణల మధ్య బజారోహణం జరిపారు అనంతరం భేరీ పూజ దేవత ఆహ్వానం అగ్ని ప్రతిష్ట నిర్వహించారు ఆలయ చైర్మన్ నరసింహమూర్తి రఘు సూపరిండెంట్ దొమ్మాట సురేందర్ రెడ్డి ప్రధాన అర్చకులు గౌరీభట్ల నరసింహ రాములు ముఖ్య అర్చకులు నరసింహమూర్తి శ్రీధర్ శర్మ అర్చకులు శ్రీనివాస్ శర్మ సాయి కృష్ణ శర్మ పాల్గొన్నారు
ఈరోజు శివపార్వతుల కళ్యాణము శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అయిన గురువారం రాత్రి 7 గంటలకు శివపార్వతుల కళ్యాణం జరిపించనున్నారు అంతకుముందు రుద్రహోమం నిర్వహించనున్నారు ఎందుకు సంబంధించిన ఏర్పాటులను ఆఫీసర్లు ఇప్పటికే పూర్తి చేశారు కళ్యాణంలో పాల్గొనే భక్తుల కోసం టికెట్లను అందుబాటులో ఉంచారు కళ్యాణ టికెట్ ధరను 516 రూపాయలుగా నిర్ణయించారు ఒక టికెట్ పై దంపతులను మాత్రమే అనుమతించనున్నట్లు ఆలయ ఆఫీసర్లు చెప్పారు
No comments:
Post a Comment