ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం జరిగిన అలంకార వాహన సేవోత్సవాలతో వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరాయి సముద్రంలో దాగి ఉన్న వేద చోర అసురుడిని మట్టుబెట్టిన మచ్చాలంకరణతో ఆలయ దేవుడిని ముస్తాబు చేసి తీర్థజనుల దర్శనార్థం ఉదయం మాడవీధుల్లో ఊరేగించారు మత్స్యవతారం విశిష్టతను తూర్పు రాజగోపురం వద్ద ఆలయ ప్రధాన పూజారులు భక్తులకు వివరించారు ఇక రాత్రివేళ స్వామి విహారయాత్ర పరవంగా భూమండలం భారాన్ని తన శిరస్సుపై మోసే ఆదిశేష వాహనంపై లక్ష్మీ సమేతంగా నరసింహుడిని అలంకృతులను చేసి వీధిలో విహార సేవోత్సవాన్ని నిర్వహించారు వేదమంత్రాలతో పాటు మంగళ వాయిద్యాల మధ్య అలంకార వాహన సేవలు కొనసాగాయి మండప ప్రాకారంలోని యాగశాలలో ఉత్సవ నిత్య హవనం చేపట్టారు ఈ ఉత్సవ పర్వాలలో ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి ఈవో రామకృష్ణారావు భక్తులు పాల్గొన్నారు
No comments:
Post a Comment