భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి ఏప్రిల్ 17న శ్రీరామనవమి 18న పట్టాభిషేకం మహోత్సవం జరగనున్నాయి ఈనెల 25న పెళ్లి పనులకు శ్రీకారం చుట్టానున్నారు ఉత్తర ద్వారం వద్ద సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచుతారు తలంబ్రాలు కలిపే క్రతువును ప్రారంభిస్తారు అదే రోజు హోలీ రావడంతో వసంతోత్సవం డోలోత్సవం నిర్వహించనున్నారు
సుమారు 200 క్వింటాల తలంబ్రాలు భక్తులు పవిత్రంగా భావించే స్వామి వారి తలంబ్రాలను గత ఏడాది 180 క్వింటాలు తయారు చేశారు ఈ ఎడారి 200 క్వింటాల మేర కలిపి ఎందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు వీటిని నవమ రోజున ప్రత్యేక కౌంటర్ల ద్వారా భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడమే కాక ముత్యాలతో కూడిన తలంబ్రాలను విక్రయిస్తారు శ్రీరామనవమి పనులకు టెండర్లు పూర్తికాగా వాటిని ప్రారంభించాల్సి ఉంది ఈ అంశంపై భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆలా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు కాగా ఏటా ఉగాది రోజుల ముఖ్యమంత్రి గవర్నర్కు శ్రీరామనవమి పట్టాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికలను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆహ్వాన పత్రిక అందజేసిన సీఎం వస్తారా లేక ఉన్నతాధికారులు హాజరవుతారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది కాగా ఏప్రిల్ 9 నుంచి 23వ తేదీ వరకు దేవస్థానంలో వసంతపక్ష ప్రీయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ నవాహానికి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి
No comments:
Post a Comment