అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగతి రక్షకుడైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది వార్షిక బ్రహ్మోత్సవాలలో 1059 నిమిషములకు మాంగల్య ధారణ జరిగింది అనంతరం స్వామి అమ్మవార్లకు తలంబ్రాల కార్యక్రమం నిర్వహించి దంపతులను ఒకచోటకు చేర్చారు జయజయ నారసింహ జయ నరసింహ నమో నరసింహ అంటూ భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి భక్తి పరవశ్యంలో మునిగి తేలారు. స్వామివారి కల్యాణోత్సవంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ బీర్ల ఐలయ్య అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఆలయ ఈవో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment