27, ఆగస్టు 2018, సోమవారం

సిరిసిల్లలో సాంచల సవ్వళ్ళు - కవిత

సిరిసిల్లలో సాంచల సవ్వళ్ళు,
నేతన్నలలో ఆనందానికి ఆనవాళ్ళు,
కష్టాల బడబాగ్నిపై కురుస్తున్న పన్నీటి జల్లు,
హృదయాలలో మ్రోగుతున్న హరివిల్లు,
నయనాలలో వర్షిస్తున్న ఆనందపు కన్నీళ్ళు,
శ్రమైక జీవులలో సౌందర్యం పరిఢవిల్లు,
నిరంతర కృషితోనే కష్టాలకు చెల్లు,
నిర్లక్ష్యం వహిస్తే అభివృద్ధి కునారిల్లు.

పాడగా పాడగా - కవిత


పాడగా పాడగా రాగమతిశయిల్లుచునుండు,
వేడగా వేడగా శ్రీకృష్ణుడు కరుణించుచునుండు,
వడి వడిగా గంగను గైకొని శ్రీశైలం వచ్చుచునుండు,
శివ శివా అంటూ మల్లన్నకు అభిషేకం గావించుచునుండు,
వెను వెంటనే నాగ 'అర్జునుని ' చేర పయనమవ్వుచునుండు,
క్రిష్ణ క్రిష్ణా యని అర్జునుడు ఆలింగనం చేసుకొనుచుండు,
జయ జయ ధ్వానాలు మిన్ను ముట్టగా నర నారాయణుల కలయిక అచ్చెరువొందించుచునుండు,
శ్రీ క్రిష్ణార్జునుల కలయిక తెలుగు ప్రజల నట్టింట్లో సిరుల పంట పండించుచునుండు,
జయజయహే శ్రీక్రిష్ణా నమో నమ: