28, ఆగస్టు 2018, మంగళవారం

'నిన్ను నమ్మి నిశిరాత్రి వేళ నిశ్చింతగా నిదురపోతున్నాము - కవిత


'నిన్ను నమ్మి నిశిరాత్రి వేళ నిశ్చింతగా నిదురపోతున్నాము...
ఓ నీరజాక్షా నీవే మాకు సదా రక్ష...
సకల చరాచర జగధ్రక్షకా శరణు శరణు...
నీకై ప్రాణార్పణ సైతం గావింతుము పాహిమం పాహిమం ఓ పద్మజాక్షా...
సదా ధర్మవర్తనులుగా  మా ప్రయాణం గావించు ఓ కమలాక్షా...
వైషమ్య రహిత జీవితం వరప్రసాదం గావించు ఓ విరూపాక్షా...
కృతజ్ఞులమై ఉందుము హృదయపూర్వక వందనాలతో ఓ వనజక్షా...
విలువైన విద్యలెన్నో నేర్చి వినువీధులకెక్కేలా చూడు ఓ విమలాక్షా...

ఎంతెంత దయ నీది ఓ సాయి - భజన

ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి 2    " ఎంతెంత "

తొలగించినావు వ్యాధులు ఊదితో
వెలిగించినావు దివ్వెలు నీటితో 2
నుడులకు అందవు నుతులకు పొంగవు 2
పాపాలు కడిగేటి పావన గంగవు   " ఎంతెంత "

భక్త కబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావూ 2
అణువున నిండిన బ్రహ్మాండమున 2
అందరిలో నీవె కొలువై ఉన్నావు   " ఎంతెంత "

ప్రభవించినావు మానవ రూపమై
ప్రసరించినావు ఆరని జ్యోతివై  2
మారుతి నీవే గణపతి నీవే 2
సర్వ దేవతల నవ్యాకృతి నీవె   " ఎంతెంత "