26, ఫిబ్రవరి 2024, సోమవారం

ఈ నెల 27 న మహా కుంభాభిషేకం

 నిజామాబాద్ నగరంలో నీ కన్యకా పరమేశ్వరి ఆలయం లో మొట్ట మొదటి సారిగా మహా కుంభాభిశేకం కార్య క్రమం ఘనంగా నిర్వహించనున్నారు.ఈ కార్య క్రమానికి శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి వారి మంగళ శాసనముల తో మహా కుంభా భిషేకం ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ పురోహితులు వెలేటి గౌరీ శంకర్ శర్మ తెలిపారు . ఈ మహా కుంభాభిశేక మహోత్సవం ఈ నెల 27 వ తేదీ మంగళ వారం నుండి 29 వ తేదీ గురు వారం వరకు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం, కిషన్ గంజ్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్య క్రమం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మాత ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ ఆర్య వైశ్య సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఘనంగా వీర బ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవం

 ఇందల్ వాయి మండలం లో నీ చాంద్రాయణ పల్లి గ్రామంలో నెలకొల్పిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం గ్రామాభవృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.44 వ జాతీయ రహదారి పై నిర్మించిన ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన విషయం విదితమే .అయితే గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కెల్ల గొప్ప దేవాలయం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం యే నని అన్నారు.అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్య క్రమం లో తాజా మాజీ సర్పంచ్ లలిత దాసు ,ఉప సర్పంచ్ ప్రకాష్ , ఎర్ర గొల్ల లింగం,సంజీవ్ రెడ్డి, దేవా గౌడ్,మురళి తదితరులు పాల్గొన్నారు.