27, మార్చి 2024, బుధవారం

శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

 వాహన సేవలో పాల్గొన్న జస్టిస్ ఎన్వి రమణ దంపతులు

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మల్లప్ప స్వామి వారు గరుడ వాహనంపై ఆలయం మాడవీధుల్లో వివా విహరించి భక్తులను కటాక్షించారు గరుడ వాహన సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్ట్ ఎన్వి రమణ శివమాల దంపతులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు కార్యక్రమంలో శ్రీ చిన్న జీయర్ టీటీడీ న్యాయాధికారి వై వీర్రాజు జిల్లా ప్రోటోకాల్ న్యాయమూర్తి ఎం గురునాథ్ ప్రోటోకాల్ మున్సిపన్ న్యాయమూర్తి పి కోటేశ్వరరావు శ్రీవారి  ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు




26, మార్చి 2024, మంగళవారం

ధర్మపురిలో వైభవంగా తెప్పోత్సవం

  జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ పుష్కరిణిలో సోమవారం సాయంత్రం ఉగ్ర నరసింహుడి తెప్పోత్సవం వైభవంగా జరిగింది ఉత్సవాలలో భాగంగా ఆరో రోజున ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బ్రహ్మ పుష్కరిని వరకు మంగళ వాయిద్యాల మధ్య తీసుకెళ్లారు కోనేరులో హంస వాహనంపై తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు అనంతరం భోగమండపంలోని కూయలపై స్వామివార్లకు డోలోత్సవం నిర్వహించారు ఈ వేడుకలు ఆచార్యులు అధికారులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిసిఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు