Sunday, 3 March 2024

రాములోరి దర్శనం ఇందూరు ప్రజల అదృష్టం

 అయోధ్యలోని బాలరాముడుని దర్శించుకోవడం ఇందూరు ప్రజల అదృష్టమని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ అన్నారు శనివారం నగరంలోని రైల్వే స్టేషన్లో ఇందూరు నుండి అయోధ్యకు వెళ్లే రెండో విడత ప్రత్యేక రైలును అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ హస్తా ప్రత్యేక రైలులో అర్బన్ నుండి 352 మంది పార్లమెంటు నుండి 1500 మంది బయలుదేరారని తెలిపారు వారికి భోజనం టి స్నాక్స్ అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయోధ్యలో రాములోరి దర్శనం అనంతరం మళ్లీ రైలు ఎక్కే వరకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం రైల్వే సిబ్బంది ఆలయ సిబ్బందిని తెలిపారు జనవరి 22 నుండి భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలలో కూడా రామనామ జపం జరుగుతున్నదని ఈరోజు ఆ బాల రాముడు దర్శించుకుని జన్మ ధాన్యం చేసుకుంటున్నారని అన్నారు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవికి హిందువు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం రాజు కార్పొ రేటర్స్ పంచారెడ్డి ప్రవళిక ఎర్రం సుధీర్ బిజెపి నాయకులు పవన్ ముందడ హరీష్ రెడ్డి కిరణ్ జింజోడు మరియు బిజెపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు




No comments:

Post a Comment