Thursday, 29 February 2024

అమ్మవారి సేవలు

 నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆర్ అండ్ బి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారి మోహన్ నాయక్ దర్శించుకున్నారు వీరికి ముందుగా స్థానిక మాజీ సర్పంచ్ డి లక్ష్మణరావు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారి మోహన్ నాయక్ పూజ సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు వీరి కాలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి క్షేత్ర పర్యటనలో భాగంగా గ్రామంలోని బొర్రా గణేశా ఆలయం నుండి మహాలక్ష్మి ఆలయం శ్రీ పాప హరేశ్వర ఆలయం శ్రీ దత్తాత్రేయ ఆలయం నుండి సరస్వతి అమ్మవారి ఆలయం వరకు బైపాస్ సీసీ రోడ్డు రహదారి కొరకై ప్రత్యేకంగా ఆరు కోట్ల రూపాయల నిధులతో పనులు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఈ పనులు పూర్తయితే బాసర మండల కేంద్రానికి వచ్చే గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు



కన్నుల పండుగ విగ్రహ ప్రతిష్టాపన

 లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలో గణపతి శ్రీ వీరభద్ర సమేత భద్రకాళీ దేవి శివలింగం నంది విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలుకుట శ్రీ మంగి రాములు మహారాజ్ వేద పండితులు యోగేష్ స్వామీల ఖర కమలములచే కన్నుల పండుగ నిర్వహించారు ఉదయం నుండి యంత్ర ప్రతిష్ట కళ్యాణం ఉత్సవం కాలన్యాసం నేత్రోన్ మలను స్వామివారి అలంకరణ సర్వదర్శనం మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా రాములు మహారాజు మాట్లాడుతూ గణపతి వీరభద్ర సమేత శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని ప్రజల ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆశీస్సులంతా చేశారు అనంతరం భక్తుల సౌకర్యార్థం కమ్మనైన వంటకాలతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పురోహితులు విశ్వనాథ శాస్త్రి పృథ్వి స్వామి వికాస్ స్వామి నిఖిల్ స్వామి లేడీస్ పెద్దలు మహిళలు యువత యువకులు పాల్గొన్నారు



కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహం

 కోటగిరి మండల కేంద్రంలోని విఠలేశ్వరాలయంలో ఈనెల 26న మొదలైన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం మార్చి 4న 3 నుండి ఈ సప్తహ కార్యక్రమం గోండిబా మహారాజ్ గంధపు ప్రకాష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది ఈ సప్తాహ కార్యక్రమం గురువారానికి నాలుగో రోజుకు చేరింది ఈ సప్తహ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు కాకడ హారతి తో మొదలుకొని జ్ఞానేశ్వర్ మహారాజ పారాయణం తుకారం మహారాజ్ గాత భజన హరి పాఠం కీర్తన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు రాత్రి 11 గంటల నుండి హరి జాగరణ భజన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికారులకు భక్తులకు కోటగిరి గ్రామానికి చెందిన ఎం శకుంతల అన్న ప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో గాయకులు, జ్ఞానేశ్వర్ తడగూర్ సోపాన్ ముదిలి సాయిబాబా పోతంగల్ నాందేవ్ కిష్టాపూర్ తగిలేపల్లి సాయిలు మోహన్ సేట్ కట్టు నగేష్ సంతోష్ భక్తులు మహిళలు పాల్గొన్నారు



కొమురవెల్లి ఆలయంలో విరాట్ ఫౌండేషన్ వాటర్ ప్లాంట్

 విరాట్ ఫౌండేషన్ ఫ్లై హై కన్సల్టెన్సీ సంస్థాపకులు యష్పాల్ వీరగోని ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం వద్ద భక్తులకు చల్లని మంచినీటిని అందించేందుకుగాను నెలకొల్పిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించాలని కోరుతూ ఆ సంస్థ బాధ్యులు గురువారం సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సంస్థ డైరీ ని మంత్రికి ప్రధానం చేశారు కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తులకు మంచినీటిని అందించాలని గొప్ప సంకల్పంతో వాటర్ ప్లాంట్ నెలకొల్పిన విరాట్ ఫౌండేషన్ సంస్థాపకులు సభ్యులను మంత్రి అభినందించారు మంత్రిని కలిసిన వారిలో విరాట్ ఫౌండేషన్ సంస్థాపకులు యష్పాల్ వీరగోని ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆకుల సోనియా సభ్యులు తానే సురేష్ పటేల్ తదితరులు ఉన్నారు

కన్నూర్ మక్కం భగవతి ఆలయం

 కేరళలోని కన్నూర్లో గురువారం ఉదయం చలాకడం కొట్టు మక్కం భగవతి ఆలయం వద్ద దయ్యం కళాకారులు నిర్వహించిన ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇది



మహాశివరాత్రికి శ్రీశైలం ముస్తాబు

 శ్రీగిరి పై నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి 11 రోజులపాటు కొనసాగే ఉత్సవాల కోసం ఈవో డి పెద్దిరాజు ఆధ్వర్యంలో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది ఇందులో భాగంగా రెండున బృంగి వాహన సేవ మూడు నాహంస నాలుగున మయూర 5న రావణ కారణ పుష్ప పల్లకి సేవ 7న గజవాహన 8న నంది వాహన సేవ 9:30 రథోత్సవం 10న ధ్వజారోహణ 11న అశ్వవాహన సేవ పుష్ప ఉత్సవం షైన్ ఉత్సవం ఉంటాయి 8న మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం ఐదున్నర గంటలకు బ్రహ్మోత్సవం 10 గంటలకు లింగోద్భవ కాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పాదాలంకరణ 12 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి లీలా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది 9న రాత్రి 8 గంటలకు తెప్పోత్సవ నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిలో అలంకార దర్శనానికి మాత్రమే భక్తులు అనుమతిస్తామని యువ తెలిపారు శివదీక్ష చేపట్టిన ఇరుముడి స్వాములకు శుక్రవారం నుంచి ఐదవ తేదీ వరకు స్వామివారి స్పర్శ దర్శనం ఉంటుందని అన్నారు బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని ఆర్జిత సేవలను పూర్తిగా ఆపేస్తున్నట్లు చెప్పారు




రామయ్య హుండీ ఆదాయం ఒక కోటి 81 లక్షలు

 భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు 56 రోజులకు ఒక కోటి 81 లక్షల 80 వేల 925 ఆదాయం వచ్చిందని వివో ఎల్ రమాదేవి తెలిపారు ఇందులో అన్నదాన సత్రంలోని నుండి ద్వారా 388100 బంగారం 174 గ్రామంలో వెండి కిలో 248 గ్రాములు ఒక వెయ్యి ఒక వంద పదిహేను యుఎస్ డాలర్లు 1000 సౌత్ ఆఫ్రికా ర్యాంట్స్ 90 కెనడా డాలర్లు 145 ఆస్ట్రేలియా డాలర్లు 17 మలేషియా రింగ్ హిట్స్ 25 ఇంగ్లాండు పౌండ్స్ 6 సౌదీ అరేబియా రియాల్స్ 100 జపాన్ యెన్ 20 థాయిలాండ్ బాతులు 15 నేపాల్ రుపీలు 15 యూఏఈ థర్హ్యమ్స్ ఆరు ఖతార్ రియాన్సు 100 ఒమన్ బైసాసు పది బంగ్లాదేశ్ టాకాలు వచ్చాయని చెప్పారు

నగదు విదేశీ కరెన్సీని బ్యాంకులో జమ చేశామని తెలిపారు



మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

 


మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు

గురువారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ బందోబస్తు మధ్యన లెక్కింపు ప్రక్రియ మొదలైంది దేవాదాయ రెవిన్యూ శాఖల సిబ్బంది స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో  లెక్కింపు జరుగుతుంది

హుండీలో బంగారు తాళిబొట్లు ఫారిన్ కరెన్సీలతో పాటు ఫేక్ నోట్లను కూడా భక్తులు కానుకలుగా వేశారు 518 హుండీలలో ఒక్కో హుండీని ఓపెన్ చేస్తూ లెక్కిస్తున్నారు అనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియను గురువారం ఎండోమెంట్ పోలీస్ మేడారం పూజారులు ప్రారంభించారు హుండీలలో విలువైన బంగారు వెండి ఆభరణాలతో పాటు చిల్లర కాయిన్స్ ను భక్తులు భారీగా వేశారు టన్నులకొద్దీ ఒడిబియ్యాన్ని బస్తాల్లో నింపుతున్నారు కాగా మొదటి రోజు మూడు కోట్ల రూపాయల 15 లక్షల 40 వేల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపార మొదటిరోజు ఆదాయాన్ని అధికారులు ఎండోమెంట్ అకౌంట్ లో జమ చేశారు లెక్కింపు ప్రక్రియను దేవాదాయ శాఖ డిప్యూటీ అడిషనల్ కమిషనర్లు శ్రీకాంతరావు సునీత పర్యవేక్షిస్తున్నారు

బంగారు భరిణలు వెండి ఉయ్యాలలు జాతరలో  చాలామంది భక్తులు తమ మొక్కులలో భాగంగా బంగారు వెండి ఆభరణాలను హుండీలలో వేశారు లెక్కింపు సమయంలో ప్రతి బాక్సులు బంగారు తాళిబొట్లు కుంకుమ భరణి కడియాలు బయటపడుతున్నాయి వెండితో చేసిన ఊయలలు సమ్మక్క సారలమ్మ తల్లుల కన్నుల రూపాలు నాగుపాము ముద్రలు ఇంటి బొమ్మలు తదితరాలు కానుకలుగా వచ్చాయి వాటిని ప్రత్యేక హుండీలో వేసి తాళాలు వేసి భద్రపరిచారు జాతరకు వచ్చిన కొందరు విదేశీ భక్తులతో పాటు ఇతర దేశాలకు వెళ్లి ఇండియాకు తిరిగి వచ్చిన తెలంగాణ భక్తులు కూడా మొక్కల క్రింద ఫారిన్ కరెన్సీని హుండీలలో కానుకలుగా సమర్పించారు ఇలాంటి వందల కొద్ది నోట్లు బయటపడుతున్నాయి మరికొందరు భక్తులు డాన్స్ చేసిన పాత 500 రూపాయల నోట్లు వేశారు 2000 రూపాయల నోట్లు కూడా వేశారు అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన 100 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు హుండీలలో కనిపించాయి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని ఆ నోట్లపై రాశారు కదా మేడారం జాతరలో మొత్తం 535 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు 518 హుండీలు పూర్తిగా నిండాయి ఇందులో 482 ఐరన్ 34 క్లాత్ రెండు కోడి బియ్యం హుండీలు ఉన్నాయి ఇంకా తెలుగు వారం హుండీలు మండపానికి చేరుకోలేదు గురువారం 134 హుండీలను తెరిచారు

లెక్కింపు సిబ్బందికి డ్రెస్ కోడ్ కానుకల లెక్కింపులో మొత్తం 400 మంది సిబ్బంది పాల్గొన్నారు వీరిని మహిళా కానిస్టేబుల్ తో చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు లెక్కింపులో పాల్గొనేవారు చేతివాటం ప్రదర్శించకుండా అధికారులు సీసీటీవీ కెమెరాలో ఏర్పాటు చేశారు మెయిన్ డోర్ వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటుచేసి తనిఖీలు చేశారు కానుకల రూపంలో వచ్చిన కరెన్సీని బ్యాంకర్లు తీసుకువచ్చిన కౌంటింగ్ మిషన్లతో లెక్కిస్తున్నారు అమ్మవార్ల కానుక లెక్కించడానికి గతంలో రెండు వారాల సమయం పట్టగా ఈసారి వారంలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు

చిల్లర లెక్కింపు కోసం మిషన్లు జాతరలో భాగంగా భక్తులు వేసిన చిల్లర నాణేలతో చిన్నచిన్న డ్రమ్ములు నిండుతున్నాయి అయితే చిల్లర నాణేల లెక్కింపు అధికారులకు తలనొప్పిగా మారేది అయితే ఈసారి కాయిన్స్ లెక్కించడానికి ప్రత్యేకంగా మిషన్లు తయారు చేయించారు కాయిన్ సైజు ఆధారంగా నాణేలను ఆ మిషన్లను వేయగానే అవిసెపరేట్ అవుతున్నాయి దీంతో లెక్కించడానికి సులభం అవుతుంది. గతంలో భారీ మొత్తంలో వస్తున్న రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల నాణేలను వేరుచేసి లెక్కించడానికి అదనంగా నాలుగు అయిదు రోజులు సమయం పట్టేది అదే సమయంలో భక్తులు మొక్కల రూపంలో వేసిన పచ్చని ఓడిబియ్యాన్ని జల్లెడ సాయంతో వేరు చేసి బస్తాల్లో నింపుతున్నారు



శివ మల్లన్న స్వామి ఆలయ నూతన ఉత్సవ కమిటీ బాధ్యత స్వీకరణ

 కాగజ్నగర్ మండలంలోని ఇస్గాం సమీపంలో శ్రీ శివ మల్లన్న స్వామి ఆలయ ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా తెలిపారు ఈ కమిటీలో చైర్మన్గా మైలారం మురళీధర్ను ఎన్నుకోవడం జరిగిందని కమిటీ సభ్యులుగా ఎమ్మాజీ శారద హరిప్రసాద్ సోనీ శృంగవరపు ప్రసాద్ జరుపుల తిరుపతి రాంఠంకి సత్తయ్యలను ఎన్నుకోవడం జరిగింది అని తెలిపారు గురువారం శివ మల్లన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులని నియామక పత్రాలను కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మైలారపు మురళీధర్ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా శివ మల్లన్న స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయుటకు కమిటీ సభ్యులతో కలిసి సాయి శక్తుల కృషి చేస్తానని అన్నారు ఆలయ ఆవరణలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని త్వరలోనే వచ్చే మహాశివరాత్రి జాతరకు ముందే మరొక దొడ్ల నిర్మిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ కొమరం భీం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుల్భం చక్రపాణి రావి మురళీకృష్ణ కోటయ్య రవి కాగజ్నగర్ పురపాలక కౌన్సిలర్ రాజేందర్ శ్రీనివాస్ ఐహిత శ్రీనివాస్ కొల్లూరు సతీష్ అనంతుల సురేష్ మైలారపు శ్రీధర్ కొలిపాక చంద్రశేఖర్ సందీప్ శివ తోట వినోద్ కోడిపేక సంతోష్ వాసవి సేవా అధ్యక్షులు కంభంపాటి సంతోష్ తోడూరి సతీష్ రాచకొండ సురేష్ భోగ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు



భక్తిశ్రద్ధలతో మహాకుంభాభిషేకం

 


నిజామాబాద్ నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మొట్టమొదటిసారి మహాకుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా మహా కుంభాభిషేకం గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ పురోహితులు వేలేటి గౌరీ శంకర శర్మ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మహా కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా గురువారం గురు వందనం ప్రాతఃకాల ఆవాహిక దేవత పూజ అమ్మవారికి విషెశ అభిషేకాలు వేద పారాయణం తదితర కార్యక్రమాలు

భక్తిశ్రద్ధలతో నిర్వహించారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సాయంత్రం భక్తిశ్రద్ధలతో మహాకుంభాభిషేకం ఉత్తర నిరాజనం యజమాను ఆశీర్వచనం ఆచార్య రుత్విక్ సన్మానము విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహా కుంభాభిషేకం పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ విగాల నగర మేయర్ దండోనీతో కిరణ్ పాల్గొనే అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు,  సత్య ప్రకాష్ సుదం రవిచందర్ దండు చంద్రశేఖర్ ముచ్కూర్ నవీన్ తడకల శ్రీను పాల్తి రవికుమార్ కోవూరు జగన్ చిదుర శ్రీనివాస్ కస్ప సంపత్ గారి పల్లి ప్రవీణ్ పద్మశాలి సంఘం నగర అధ్యక్షులు నరసయ్య సెక్రటరీ ఎనుగందుల మురళి కార్పొరేటర్ ధర్మపురి సాయి సత్యపాల్ బిల్లా మహేష్ నీలగిరి రాజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ సభ్యులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు అధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ గుప్త ప్రధాన కార్యదర్శి రవికుమార్ గుప్త కోశాధికారి రాఘవేంద్ర గుప్తా ఉపాధ్యక్షుడు నరేంద్ర గుప్తా రాజేందర్ గుప్తా రుక్మిణి ప్రసాద్ గుప్త కరుణాకర్ గుప్తా చంద్రశేఖర్ గుప్త శంకర్ తదితరులు పాల్గొన్నారు



అంగరంగ వైభవంగా అనంతుని కళ్యాణోత్సవం

 నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ ఏ శివారులోని శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అలంతుని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వేద పండితుల వేదమంత్రాలు నడుమ అనంతుని ఆటపాటలతో భక్తిశ్రద్ధలతో కళ్యాణం జరిగింది చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు హాజరై మొక్కలు తీర్చుకున్నారు అనంత అనంతయ్య దేవేశ అనంత ఫలదాయకాయ అనంత దుఃఖనాశాయ అనంతయా నమో నమః అంటూ వేద పండితులు వేదమంత్రాలు చదివారు గుండారం మల్కాపూర్ జలాల్పూర్ సారంగాపూర్ ఖానాపూర్ గ్రామాలను ఉండే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక హైదరాబాద్ నుండి హాజరైన భక్తులు తమ కానుకలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు  అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు రమణాచార్యులు సీతారామచార్యులు శ్రీనివాసచార్యులు వివిధ గ్రామాల నుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు





హనుమాన్ ఆలయానికి మైక్ సెట్ వితరణ

 పిట్లం మండలంలోని చిల్లరికి హనుమాన్ ఆలయానికి గ్రామానికి చెందిన దుమ్మ శంకర్ అనే దాత పదివేల రూపాయల విలువ చేసే మైక్ సెట్ గురువారం ఆలయ కమిటీ సభ్యులకు వితరణ చేశారు ఆయన మాట్లాడుతూ అనుమానాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో హనుమాన్ మాల ధారణ స్వాములకు ఈ మైక్ సెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు అదేవిధంగా ఉదయాన్నే గ్రామస్తులను మేల్ కోల్పోయిన అనుమాన ఆలయం ఆవరణలో ఆంజనేయ స్వామి చాలీసా వినిపించడం జరుగుతుందని పేర్కొన్నారు



శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు

 రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్లో గల నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగాయి గురువారం ఈ వేడుకలలో మాజీ స్పీకర్ బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని ఆయన సూచించారు భక్తితోనే ముక్తి లభిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బద్దం సంజీవరెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ మాజీ విండో చైర్మన్ పత్తి రాము టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు





నవగ్రహ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు

 బోధన్ పట్టణంలోని మారుతి మందిరం నూతన మండపంలో గురువారం నవగ్రహ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి నెట్టూరి వామన అవధాని యొక్క సుహస్తాల చేత యంత్ర స్థాపన చేతి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ బాలయోగి పిట్ల కృష్ణా మహారాజ్ ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ మహేష్ జోషి కేదార్ కార్యనిర్వాన  అధికారి రవీందర్ గుప్తా రాములు విగ్రహ దాతలు  తదితరులు పాల్గొన్నారు



ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

 


మాకూరు మండల పరిధిలోని మామిడిపల్లి శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగాయి స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలతో దూపదీప నైవేద్యాలు కొనసాగాయి యాగశాల అర్చనలు భక్తులందరినీ ఆకట్టుకున్నాయి శ్రీవారి కల్యాణ మండపంలో రోజు కళా ప్రదర్శనలు పౌరాణిక నృత్య ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు చివరి రోజు పురస్కరించుకుని శాంతి పాఠము శ్రీ లక్ష్మీ నారాయణ ఎస్టి చక్రస్నానము సాయంకాల సమయంలో శ్రీ పుష్పయాగము పల్లకి సేవ సత్తాభరణం మహాదాసి నిర్వచనము వంటి కార్యక్రమాలు జరిగాయి మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అమృతలతో రమాదేవి రమాదేవి శ్రీనివాస్ రెడ్డి రమణారెడ్డి స్థానికులు పాల్గొన్నారు



మార్కండేయ స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం

 



నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో గురువారం శ్రీ భక్త మార్కండేయ విగ్రహము రాజగోపుర ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా భక్తుశ్రద్ధలతో జరిగాయి ఐదు రోజులుగా ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతుండగా చివరి రోజు గురువారం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి కరకమలములచే మార్కండేయ ప్రాణ ప్రతిష్ట జరిపారు ఈ సందర్భంగా తెల్లవారుజామునుంచే ద్రొక్కుబలి దిగ్బలి హరణము నేత్రోన్ మిలీనము మహా పూర్ణాహుతి కుంభ సంప్రోక్షణ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి శాంతి కళ్యాణము కార్యక్రమాలు నిర్వహించారు  శతాధి ప్రతిష్టాపన చార్యులు చౌటుపల్లి గంగా ప్రసాద్ దీక్షితులు పౌరోహిత్యంలో జరిగిన పార్వతి రాజరాజేశ్వర స్వామి శాంతి కల్యాణంలో మంగి రాములు మహారాజు ఇప్పకాయల హరిదాసు స్వామి పాలకొండ మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు మాజీ ఎమ్మెల్యే బేగాల గణేష్ గుప్తా మేయర్ దండు నీతో కిరణ్ తదితర ప్రముఖులు మార్కండేయ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నరసయ్య జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిర్జు దత్తాత్రేయ వర్కింగ్ ప్రెసిడెంట్ పులగం హనుమాన్లు మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజరాజేశ్వరి నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నరసయ్య దాసరి కొండయ్య కారం కొండ విట్టల్ దేంగి మోహన్ మందిర కమిటీ చైర్మన్ లక్కవత్రి దేవదాస్ రాపల్లి గురుచరణ్ ఏజీ రామస్వామి గుడ్ల భూమేశ్వర్ బల్ల లక్ష్మీబాయి కొండ గంగా చరణ్ చింతల గంగాధర్ బీమార్తి సురేందర్ పెంటిరాజు బుస శ్రీనివాస్ జై సత్యపాల్ తుమ్మ నాగభూషణం సుభాష్ మహేష్ సత్య ప్రకాష్ సిర్పరాజు రాజు తదితరులు పాల్గొన్నారు


ఖండేరాయుడి కళ్యాణ మహోత్సవం

 





భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ 

సదాశివ నగర్ మండలంలోని ఉత్తనూర్ గ్రామంలో ఖండేరాయ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఖండేరాయ మహాదేవుని మాండాలమ్మ కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళ్యాణ వేడుకలకు వివిధ గ్రామాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు వేడుకలకు ముందు పట్టు వస్త్రాలను శ్రీ హనుమాన్ మందిరం నుంచి భాజా భజంత్రీల మధ్య ఊరేగింపుగా భక్తిశ్రద్ధలతో ఆలయం వద్దకు తీసుకువచ్చి వేడుకలు జరిపారు భక్తులకు భారీ ఎత్తున అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ దొడ్ల రవి మాజీ సర్పంచ్ మోతే సాయప్ప రాములు ఎంపీటీసీ రామచంద్రరావు విండోస్ చైర్మన్ ప్రభాకర్ రావు ఉపసర్పంచ్ శివ పాటిల్ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గుడ్ల శ్రీకాంత్ రావు కాంగ్రెస్ బిజెపి నాయకులు పాల్గొన్నారు. శ్రీ కండేరాయుని కళ్యాణ వేడుకలలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్న ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో. సదాశివ నగర్ మాజీ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి ఉపసర్పంచ్లు శివ పాటిల్ వంకాయల రవి టిఆర్ఎస్ రవి అబ్బ సంజీవులు శ్రీకాంత్రావు రాజు వినోద్ శ్రీనివాస్ నాయక్ పరమేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు






అన్నపూర్ణాదేవి విగ్రహ ప్రతిష్టాపన

 


బిచ్కుంద మండల కేంద్రంలోని బండయప్ప మఠంలో గురువారం అన్నపూర్ణాదేవి గణపతి విగ్రహం నవగ్రహాల విగ్రహాలను ప్రతిష్టించారు మఠం పీఠాధిపతి శ్రీ సోమయ్యప్ప స్వామి కమల ఖడ్గం హానేగా మఠం పీఠాధిపతుల సమక్షంలో ప్రత్యేక పూజలు హోమాలు యజ్ఞం పాలాభిషేకం చేసి విగ్రహాల ప్రతిష్టాపన చేశారు అన్నపూర్ణాదేవి మందిరం ముందు ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొని పూజలు చేసే ముక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ సోమయ్యప్ప స్వామి మాట్లాడుతూ ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి దైవభక్తి పెంపొందించుకోవాలన్నారు అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మఠాధిపతులు మల్లికార్జున స్వామి శంకరాలింగ వివాచార్య కాంగ్రెస్ విఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

మహనీయ చరితులు

 భారతీయ తాత్విక చింతన స్రవంతిని జీవజల ధారలచే పరిపుష్టం చేసిన మహనీయులు కొందరు చరిత్రలో ఒక సమూహంగా మనకు దర్శనం ఇస్తారు వారి గురించి సంగ్రహంగా సప్తర్షులు వీరు ఏడుగురు ఏడు నక్షత్రాలుగా ఆకాశంలో పట్టణామవుతున్నారు అదే సప్తర్షి మండలం వీరు ప్రతి మనువంతరంలో మారుతుంటారు ఇప్పుడు నడుస్తున్నది ఏడోదైన వైవస్వత మనవంతరం. ఈ మనవంతరంలో సప్తర్షులు కష్యపుడు ఆత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని సప్తర్షుల పేర్లు వివిధ గ్రంథాలలో స్వల్ప మార్పులతో కనిపిస్తాయి

పంచర్షులు పేరు ఐదుగురు సానగు సనాతన  అహబూన ప్రత్న సుపర్ణ  సప్తర్షుల పంచర్ల ప్రస్తావన వేదాలలో ఉన్నది వీరందరూ గోత్ర ఋషులుగా ప్రసిద్ధులు

నవ నాథులు మీరు తొమ్మడుగురు దత్తాత్రేయ సంప్రదాయాన్ని వ్యాప్తి చేసిన వారు వీరి పేర్లు మత్చంద్రనాథ్ గోరక్నాథ్ జలంధర్ నాథ్ కనీఫ్ నాథ్ గహ్నీ నాథ్ నగేష్ నాథ్ చర్పతి నాథ్ బర్తరీ నాథ్ రేవన నాథ్

మహా సిద్ధులు వీరు 84 మంది బౌద్ధంలో మహాముద్ర అనే తాంత్రిక సంప్రదాయం ఒకటి ఉన్నది మొదటగా ఆ సంప్రదాయాన్ని నెలకొల్పి వ్యాప్తి చేసిన వారు వీరు వీరిని మహా సిద్దులని పిలుస్తారు వీరు భారత దేశంలో క్రీస్తు శకం 8 నుంచి 12 శతాబ్దాల మధ్యన జీవించారు వీరిలో కొందరి పేర్లు విరూపా సలహా నరోప నిర్గుణపా వీరిలో యోగిని మణి భద్ర యోగినీ భద్రమే కల వంటి స్త్రీలు ఉన్నారు వీరందరి గురించిన సమాచారం కీప్ డౌన్ రాసిన మాస్టర్స్ ఆఫ్ మహా ముద్ర అనే ఆంగ్ల గ్రంథంలో చూడవచ్చు

నాయన్ మార్లు వీరు 63 మంది శివ భక్తులు వీరి గురించి చెప్పేదే పెరియ పురాణం తమిళ దేశంలో శివాలయాలు దర్శిస్తూ భక్తి పాటలు పాడుతూ సంచరించారు వీరి కాలం క్రీస్తుశకం 6 నుంచి 9 మధ్యాహ్నం సుందరర్ అప్పర్ సంబంధర్ వీరిలో ముఖ్యులు

ఆళ్వారులు వీరు పనిదరు అనగా 12 గురు విష్ణు భక్తులు మీరు పాడిన పాటలు పాశురాలు అవి నాలుగువేలు నాలాయిరంగా ప్రసిద్ధం నమ్మాళ్వార్ ఆండాళ్ వీరిలో ముఖ్యులు న్యాయం మార్లు ఆడవాళ్లు దేశంలో భక్తి పరిమళాన్ని గుబాలింప చేశారు

అహోబిలం నారసింహుడు కి పట్టు వస్త్రాలు

 తొలిసారిగా సమర్పించిన రేవంత్ సర్కార్ నంద్యాల జిల్లాలో ప్రముఖ విష్ణు క్షేత్రమైన అహోబిలం నరసింహస్వామికి తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా పట్టు వస్త్రాలను సమర్పించింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ గద్వాల జిల్లా జోగులాంబ దేవస్థానం ఈవో పురంధర్ కుమారులు బుధవారం సంప్రదాయ బద్దంగా పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా అహోబిల క్షేత్ర అధికారులు అర్చకులు స్పందించారు కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు శైవ భక్తుడని రుద్రవరంలో ఒక సూర్యోదయాన శివలింగాన్ని పూజిస్తుండగా శివలింగంలోని నరసింహస్వామి రూపం కనిపించిందని తెలిపారు కాకతీయ కాలం నుంచి స్వామికి కైంకర్యం చేసేవారని తెలంగాణ నుంచి పూర్వం దేవస్థానానికి కైంకర్యాలు వందేవని పేర్కొన్నారు ఆ సంప్రదాయాన్ని తిరిగి తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం లక్ష్మీనరసింహస్వామికి పట్టు వస్త్రాల సమర్పణతో ప్రారంభించినట్లు అధికారు లు వెల్లడించారు

ఘనంగా తిరుగువారం ముగిసిన మేడారం

 మేడారం మహా జాతర ముగిసింది అత్యంత వైభవంగా కొనసాగిన జాతర బుధవారం తిరుగు వారం పండుగతో ముగిసింది ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం వనదేవతలకు వడ్డెలు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు గద్దెలు గ్రామంలోని గుడిని శుద్ధి చేశారు ఆడపడుచులు అలుకు పూతలతో రంగురంగుల ముగ్గులు వేసి అమ్మవార్ల గద్దెలను అందంగా అలంకరించారు డోలు వాయిద్యాలు నడుమ తల్లులకు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు తిరుగుబారం రోజున కూడా తల్లులు ఇక్కడే కొలువుదీరి ఉంటారని నమ్మకంతో భక్తులు మేడారానికి పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తల్లులకు బంగారాన్ని సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు ఫిబ్రవరి 7న గుడి మెలిగే పండుగతో మొదలై 14న మండలిగే పండుగ 21 22 తేదీల్లో నా వనదేవతలు గద్దెలకు చేరడం 23న భక్తుల మొక్కులు 24న వనప్రవేశం కార్యక్రమాలు జరిగాయి



నేడు మహా కుంభాభిషేకము

 నిజామాబాద్ జిల్లా కేంద్రం కిషన్గంజ్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో బుధవారం మూలమంత్ర జపము చండీ హోమము విష్ణు సహస్రనామ పారాయణ చేశారు కంచి కామకోటి పీఠానికి చెందిన వేద పండితులు ఆలయ అర్చకులు గౌరీ శంకర్ శర్మ నేతృత్వంలో కలశ పూజలు నిర్వహించారు పూర్ణాహుతి మంత్రపుష్పము తీర్థప్రసాద వితరణ చేపట్టారు గురువారం కలశపూజ మహా కుంభాభిషేకం చేయనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు



వేదమంత్ర పారాయణాలు

 నిజామాబాద్ లోని కోటగల్లి మార్కండేయ మందిరంలో కొనసాగుతున్న నూతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో భాగంగా బుధవారం దుర్గ సూక్త హవనము మూలమంత్ర జపము వేదమంత్ర పారాయణాలు చేశారు ప్రముఖ ప్రతిష్టాపన చార్యులు గంగా ప్రసాద్ నేతృత్వంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు మంగళహారతులు సమర్పించారు నగర పద్మశాలి సంఘం ఆలయ కమిటీ ప్రతినిధులు వివిధ ప్రాంతాల భక్తులు మొక్కులు చెల్లించారు రాజగోపుర నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు గురువారం ఉంటాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు మహాకుంభాభిషేకం రుత్విక్ సన్మానం పూర్ణాహుతి అన్నదానం ఉంటుందని వెల్లడించారు



భగవంతుడిని ఏమని అడగాలి

 వివేకానంద యుక్త వయసులో ఉండగా తండ్రి విశ్వనాథ దత్త హఠాత్తుగా కన్నుమూశారు ఒక్కసారిగా కుటుంబం పేదరికంలో కురుకుపోయింది పెద్ద కుమారుడైన వివేకానందుడే ఆధారమయ్యాడు పట్టభద్రుడైన ఆయనకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు అలాంటి క్లిష్ట పరిస్థితులలో గురువు పరమహంస వద్దకు వెళ్లి బాధపంచుకున్నాడు అప్పుడు ఆయన సమీపానే ఉన్న దక్షిణేశ్వర కాళి ఆలయం వైపు చూపిస్తూ ఇవాళ మంగళవారం ఈరోజున అమ్మవారిని ఏది కొడితే అది అనుగ్రహిస్తుంది వెళ్లి ప్రార్థించు అన్నాడు ఆ సాయంత్రం వివేకానంద మందిరానికి వెళ్లి అమ్మను ప్రార్థించారు తిరిగి వచ్చాక రామకృష్ణుడు అమ్మ ఏమన్నది అని అడిగారు అరే అడగటం మర్చిపోయాను అని వివేకానంద మదనపడ్డారు. సరే మళ్ళీ వెళ్ళు అన్నారు పరమహంస ఈసారి అదే పద్ధతి మూడోసారి స్వామీజీ ఖాళీ ఆలయానికి వెళ్లి వచ్చాక ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా కనిపించారు పరమహంసను ఉద్దేశించి జగన్ మాతను డబ్బు కావాలని ఎలా అడగగలను? అలా చేస్తే మహారాజు దగ్గరకు వెళ్లి గుమ్మడికాయ అడిగినట్లు ఉంటుంది నిస్వార్ధ ప్రేమతో భక్తితో అమ్మను అర్థం చేసుకునే శక్తిని ఇమ్మని ప్రార్థించాను అన్నారు వివేకానంద కానీ అమ్మవారి కృప గురువుగారి ఆశీస్సులు ఫలంగా అప్పటినుంచి వివేకానంద కుటుంబానికి ఎలాంటి లోటు రాలేదు అవసరమైన వసతులకు ఇబ్బంది కలగలేదు

నేరుగా ఇంటికి అయోధ్య హనుమాన్ ప్రసాదము

 అయోధ్యలో ఉన్న హనుమాన్ గడి ఆలయ ప్రసాదం ఇక నేరుగా భక్తుల ఇళ్ళకు చేరనున్నది బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ లక్షల సంఖ్యలో పెరిగింది దీంతో చాలామంది భక్తులకు హనుమాన్ గడి ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు ఈ నేపథ్యంలో భారతీయ తపాలా శాఖ హనుమాన్ గడి ఆలయ ప్రసాదాన్ని పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డిప్యూటీ పోస్ట్ మాస్టర్ అయోధ్య ఖాన్ 224123 చిరునామాతో ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ తీయాలి భక్తుల చిరునామా ఇచ్చి ఆర్డర్ చేయాలి పిన్కోడ్ ఫోన్ నెంబర్ తప్పనిసరి ఇలా ఆర్డర్ చేశాక స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రసాదాన్ని ఇంటికి పంపుతామని ప్రయోగరాజ్ వారణాసి జోన్ పోస్ట్మాస్టర్ కృష్ణకుమార్ తెలిపారు 251 ఒక్క రూపాయల మనీ ఆర్డర్ కు లడ్డూలు, హనుమాన్ చిత్రం మహావీర్ గంధం అయోధ్య దర్శన పుస్తకం పంపుతారు

Wednesday, 28 February 2024

కాలభైరవుడిని దర్శించుకున్న న్యాయవాదులు

 రామారెడ్డి మండలంలోని కాలభైరవ స్వామిని హైకోర్టు న్యాయవాదులు మంగళవారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ఈవో ప్రభు రామచంద్రం వారిని సన్మానించే స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు కార్యక్రమంలో బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు అబ్బాయిలు దేవిదాస్ పార్టీ జిల్లా సభ్యులు పందుల గోపి రామారెడ్డి మండల కార్యదర్శి పూర్ణచందర్ అమ్ములు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

రాచ్చేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

 డోంగ్లి మండలంలోని ఎన్బురా గ్రామ శివారులో ఉన్న గల్లా   రాచ్చేశ్వర ఆలయంలో భక్తులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రాచయేశ్వరుడికి అన్నంతో అలంకరించారు అన్న పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం పూజల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు  ఈ యాలయం మహారాష్ట్ర కర్ణాటకకు సరిహద్దుల్లో ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి

వైభవంగా రేణుక జమదగ్నిలా కళ్యాణం

 


భిక్కనూరు మండల కేంద్రంలో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారి కళ్యాణం నేత్రపర్వంగా కొనసాగింది అమ్మవారి కల్యాణాన్ని పురస్కరించుకొని ఎల్లమ్మ జమదగ్నిల ఉత్సవ విగ్రహాలను పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి కళ్యాణం నిర్వహించారు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు అక్కడ జరిగిన కళ్యాణ మహోత్సవములు భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అమ్మవారికి మహిళలు ఒడిబియ్యం పోసి ముక్కులు తీర్చుకున్నారు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి కళ్యాణాన్ని పురస్కరించుకొని గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.



శ్రీశైలంలో అమెరికా భక్తుడు భూరి విరాళం

 శ్రీశైలం మల్లన్నకు అమెరికాకు చెందిన ఒక భక్తుడు మంగళవారం బూరి విరాళం సమర్పించారు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన అమెరికా భక్తుడు కొత్తపల్లి సునీల్ దత్ బంగారు వెండి సామాగ్రి ఆభరణాలను ఆలయానికి అందజేశారు 28.3 గ్రాములు ఉన్న రెండు బంగారు బాషకాలు ఐదు గ్రాముల బంగారు కంకణం ఒకటి. రెండు ఐదు కిలోల వెండి పళ్ళెం 865 గ్రాముల వెండి శక్తి ఆయుధము 550 గ్రాముల వెండి నాగ హారతి 20090 గ్రాముల కుక్కుట ధ్వజము 750 గ్రాముల 5 వెండి గిన్నెలు 920 గ్రాముల గంధక్షత గిన్ని ఒక వంద 90 గ్రాముల కమండలాన్ని 300 గ్రాముల పెద్దక మండలాన్ని కొత్తపల్లి సునీల్ దత్ గారు కుటుంబం అందజేసింది నంద్యాల జిల్లా పగిడాలకు చెందిన కౌలూరి సింధూర కూడా 810 మరియు 350 గ్రాముల చొప్పున 2 వెండి పళ్ళాలు 615 గ్రాములున్న మూడు వెండి చెంబులను ఆలయానికి అందజేశారు అనంతరం దాతలకు దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రము ప్రసాదము అందజేసి సత్కరించారు రెండు రోజుల క్రితం చెన్నైకి చెందిన భక్తురాలు కోనేరు విమలాదేవి స్వామివారికి 343 గ్రాముల బంగారు పళ్లెం అందజేశారు.

Tuesday, 27 February 2024

ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

 మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి సిరిసిల్ల వాస్తవ్యులు ముత్యంరావు లక్ష్మీ దంపతులు తమ వంతు సహాయంగా ఆలయ ప్రాంగణంలోని నాగుపాము పుట్టపైన రేకుల షెడ్డు నిర్మాణానికి 1,50,000 ఇచ్చుటకు వాగ్దానం చేసి 50 వేల రూపాయలను అడ్వాన్సుగా మంగళవారం ఆలయ అధికారులకు చెల్లించారు ఆలయం తరఫున సన్మానం చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి ఈవో ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు


ప్రారంభమైన అనంత పద్మనాభ స్వామి ఉత్సవాలు

 నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ ఏ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మంగళవారం ఉదయం స్వామివారిని లక్ష్మాపూర్ నుండి కొండపై వరకు డబ్బులు వాయిద్యాలతో పాటలు పాడుతూ ఊరేగించారు అనంతరం అంకురారోహణ రుత్విక్ కుల దీక్ష హారతి మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు మాజీ సర్పంచ్ బాగారెడ్డి వీడిసి గంగారాం రాంరెడ్డి మాజీ సర్పంచ్ శేఖర్గౌడ్ భోజన్న తదితరులు  పాల్గొన్నారు.




సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

 బోర్ గాంపి శివారులో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పేద పండితులు వేదమంత్రాలు చదివారు నగరం బోర్గాం ధర్మారం గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు

భక్తిశ్రద్ధలతో చండీ హోమము

 


నిజామాబాద్ నగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో మొట్టమొదటిసారి మహాకుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా గణపతి హోమం చండీ హోమం భక్తీశ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పురోహితులు వేలేటి గౌరీ శంకర శర్మ హాజరై అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మహా కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా మంగళవారం గోపూజతో పాటు గణపతి హోమం 128 కళాశాల పూజ కుంభాభిషేకం సంప్రోక్షణ 108 జంటలు పాల్గొనడం జరిగిందని తెలిపారు ఆ కలశాల నీరు అమ్మవారికి అభిషేకంగా చేసి ఆ కలశాలను దాతలకు ప్రసాదంగా ఇవ్వడం జరిగింది అన్నారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సాయంత్రం భక్తిశ్రద్ధలతో చండీ హోమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి దయా నగర ప్రజలపై ఉండాలని భక్తిశ్రద్ధలతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ సభ్యులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు అధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ గుప్తా ప్రధాన కార్యదర్శి రవికుమార్ గుప్తా కోశాధికారి రాఘవేంద్ర గుప్తా ఉపాధ్యక్షులు నరేందర్ గుప్తా రాజేందర్ గుప్తా రుక్మిణి ప్రసాద్ గుప్తా కరుణాకర్ గుప్తా చంద్రశేఖర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు

ఘనంగా శ్రీవారి కల్యాణ మహోత్సవం

 మాకూరు మండల పరిధిలోని మామిడిపల్లి శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జరిగాయి అంతేకాకుండా సాయంకాల సమయంలో గరుడ వాహనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు జరిగాయి మధ్యాహ్న సమయంలో అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అమృతలతో ప్రభాదేవి రమాదేవి శ్రీనివాస్ రెడ్డి రమణారెడ్డి స్థానికులు తదితరులు పాల్గొన్నారు

వైభవంగా మార్కండేయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం

 నిజామాబాద్ నగరంలోని కోట గల్లి మార్కండేయ మందిరంలో శ్రీ భక్త మార్కండేయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాల అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు మంగళవారం శతాధిక ప్రతిష్టాపనచార్యులు చౌటుపల్లి గంగా ప్రసాద్ దీక్షితులు పురోహిత్యంలో చండీ హోమము రుద్ర హోమాలు న్యాస హోమము అధివాస హోమము ఫల పుష్పాదివాసము అవధారం తదితర కార్యక్రమాలు నిర్వహించారు పూజలు చేశారు నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పోల్కం హనుమాన్లు నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నరసయ్య నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నరసయ్య దాసరి గుండయ్య కైరం కొండ విట్టల్ బింగి మోహన్ మందిర కమిటీ చైర్మన్ లెక్క పత్రి దేవదాస్ రాపల్లి గురు చరణ్ గుడ్ల భూమేశ్వర్ పల్లె లక్ష్మీబాయి కొండ గంగాచారం చింతల గంగాధర్ భూస శ్రీనివాస్ జై సత్యపాల్ తుమ్మ నాగభూషణం అంకం రాజేందర్ పాల్గొన్నారు




ఘనంగా నేక్ బీబీ దర్గా ఉరుసు

 బాన్సువాడ మండల కేంద్రంలోని అనేక బీబీ దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు మంగళవారం రాత్రి దర్గాను అలంకరించారు కుల మతాలకు అతీతంగా భక్తులు తరలివచ్చి అనేక బీబీ దర్గా వద్ద మొక్కులు చెల్లించుకున్నారు ఇస్లాంపూర సంగమేశ్వర కాలనీ పిఎస్ఆర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీల నుంచి ఊరేగింపు నిర్వహించారు



వైభవంగా వడ్యాల్ రేణుక ఎల్లమ్మ జాతర

లక్ష్మణ చాంద మండలంలోని వడియాల్లో కొలువుదీరిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మంగళవారం మంగళరంగ వైభవంగా జరిగింది ఉదయమే అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు అమ్మవారి కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే జాతర మహోత్సవ వేడుకలు జరగగా వడియాలు కనకాపూర్ గ్రామాలను ప్రజలే కాకుండా మామడా వివిధ మండలాల ప్రజలు సైతం హాజరై అమ్మవారిని దర్శించుకుని ముక్కలు చెల్లించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మామడా లక్ష్మణ చాంద్ర మండలాల గౌడ కుల సంఘాల నాయకులు ఏర్పాట్లు పర్యవేక్షించారు అలాగే నిర్మల్ డిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ నేత కూచాడి శ్రీహరి రావు హాజరై ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వారితో పాటు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు


నేటి నుండి పద్మనాభ స్వామి ఉత్సవాలు

 ఆహ్లాదకర వాతావరణంలో ఎత్తైన రాతికుండల నడుమ వెలసిన అనంత పద్మనాభ స్వామి భక్తుల పాలిటి కొంగు బంగారం గా నిలుస్తున్నాడు మల్కాపూర్ శివారులోని వందల ఏళ్ల నాటి ఆలయంలో స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఏటా మాఘ బహుళ తదియ నుంచి మాఘ బహుళ అష్టమి వరకు వేడుకలు నిర్వహిస్తారు మొదటిరోజు అంకురార్పణతో కార్యక్రమాలు మొదలై ఆరు రోజులపాటు కొనసాగుతాయి ధ్వజారోహణ కళ్యాణము డోలారోహణము రథోత్సవము చక్రతీర్థము ఏకాంత సేవ వంటి కార్యక్రమాలు చేపడతారు. మల్కాపూర్ ఏ లక్ష్మాపూర్ గ్రామాలకు చెందిన ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు వస్తారు

37 ఆలయ చరిత్ర శ్రీ లక్ష్మీనరసింహస్వామి రూపంలో వెలసిన పద్మనాభ స్వామి ఆలయానికి 300 ఏళ్ల చరిత్ర ఉందని అర్చకులు చెబుతున్నారు ఈ ప్రాంతాన్ని పాలించిన గాంధారి వంశస్థులు రాజ్యాన్ని విస్తరించే క్రమంలో మల్కాపూర్ ఏ శివారులో గుర్రపు బండ్లపై సంచరించారు గుండారము మల్కాపూర్ మధ్యనున్న పెద్ద చెరువు వద్దకు రాగానే గుర్రాలు ఆగిపోయాయి. ఓ అశ్వం తాళ్లు తెంచుకొని పరుగులు తీసింది దానిని సైనికులు రాజకుటింబీకులు వెంబడించారు చెరువుగట్టుపై ఎత్తైన కొండపై ఉన్న రాతి గుహల్లోకి వెళ్లిన గుర్రం కనిపించకుండా పోయింది. కొద్దిసేపటి తర్వాత గుహల మధ్య సన్నటి కాంతి రావడానికి వారు గమనించారు భూపాలకు వెళ్లి చూడగా కుర్రం రాళ్ల మధ్యలో చిన్న బంధువుగా మారడాన్ని గుర్తించారు ఇది తమ కుల దైవమైన పద్మనాభుడి మహిమ అని తలిచి ఏకశిరతో ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభి ంచారు

పెరుగుతున్న రూపము రెండు రాతి పలకల మధ్య చిన్న బిందువు రూపంలో వెలసిన స్వామి రూపం క్రమంగా పెరుగుతూ వస్తుందని అర్చకులు చెబుతున్నారు ప్రస్తుతం శంకు చక్రాలు ధరించిన లక్ష్మీ అనంతపద్మనాభుడి రూపంలో భక్తులకు స్వామివారి దర్శనం ఇస్తున్నారు




శివరాత్రి ధ్వజారోహణం

 కామారెడ్డి లోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం కామారెడ్డి కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం మహాశివరాత్రి పర్వదినం ముందస్తు కార్యక్రమం నిర్వహించారు ఓంశాంతి కేంద్రంలో శివ ధ్వజారోహణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు గంగాల త సంతోషిని తదితరులు పాల్గొన్నారు

వీరభద్ర స్వామి ఆలయంలో పూజలు

 మద్నూర్ మండలంలోని కోడి చీర గ్రామానికి సమీపంలోని గుట్టపై ప్రసిద్ధి చెందిన చిన్నమ్మ కోరి వీరభద్ర స్వామి సోమవారం భక్తులు అన్న ప్రసాదం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు వీరభద్రుడికి అన్నం పెరుగుతో అభిషేకం అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు

భక్తిశ్రద్ధలతో శాభాషా వలి ఉరుసు

 ఎల్లారెడ్డిలో శాభాషా వలి దర్గా ఉరుసు ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు భాగంగా పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం దర్గా వరకు ఊరేగింపుగా వెళ్లారు అనంతరం సందల్ సమర్పించారు కార్యక్రమంలో మైనారిటీ నాయకులు తదితరులు ఉన్నారు

అయోధ్యలో బిక్కనూరు దంపతుల సేవ

 అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా భాగ్యనగర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం సేవలో భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన దంపతులిద్దరూ నెలరోజులుగా సేవలు అందిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన శనిశెట్టి వెంకటేశం గుప్తా సుభద్ర గత నెల 25వ తేదీన అయోధ్యకు చేరుకున్నారు అక్కడ భాగ్యనగర్ సేవాసమితి ఆధ్వర్యంలో భక్తులకు నిర్వహిస్తున్న అన్నదానంలో వారు పాలు పంచుకుంటున్నారు అంతేకాకుండా భక్తులు అన్నదానానికి అవసరమైన సామాగ్రిని కూడా తెప్పిస్తూ శ్రీరాముడు సేవలో తరిస్తున్నారు సోమవారం శని శెట్టి వెంకటేశం గుప్తా సుభద్రలు ఫోన్లో మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడిని దర్శనం అద్భుతం అని అన్నారు ప్రతిరోజు భాగ్యనగర్ సేవా సమితి ఆధ్వర్యంలో 30 వేల మంది భక్తులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ అందజేస్తున్నామన్నారు.

ఘనంగా ఖండేరాయ ఉత్సవాలు ప్రారంభం

 సదాశివ నగర్ మండలంలోని ఉత్తనూర్ గ్రామంలో ఖండేరాయ ఆలయ వార్షికోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి సదాశివ నగర్ కు చెందిన సనాతన భజన మండలి ఆధ్వర్యంలో భజన కీర్తనలు ఆలపించారు ఈ కార్యక్రమంలో వీడిసి చైర్మన్ దొడ్ల రవి వీడీసీ ప్రతినిధులు గ్రామస్తులు యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు


నేడు రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

 లక్ష్మణ చాందా మండలంలోని వడియాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ నీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు గత వారం రోజుల నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి లక్ష్మణ చందా మామడ మండలాల గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించే ఈ రేణుక ఎల్లమ్మ మాత ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి ఈ వారం రోజుల నుండి ప్రతిరోజు మాటకు ప్రత్యేక పూజ కార్యక్రమాలతోపాటు ఆలయ ప్రాంగణంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గత 25వ తేదీ ఆదివారం పోచమ్మ బోనాలు ఎల్లమ్మ చరిత్ర కథలు సోమవారం పుట్టదని ఎల్లమ్మ బోనాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా నేడు 27వ తేదీ మంగళవారం రోజు వేద పండితులతో శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంతో పాటు నాగవెల్లి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు రేణుకా మాత కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని ని వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ రేణుక ఎల్లమ్మ మాత ఆశీర్వాదం పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం అమ్మవారి కళ్యాణ శుభ సందర్భంగా భక్తులకు ఎలాంటి సహకార్యాలకు ఇబ్బందులు కలగకుండా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రాంగణంలో టెంట్లు తాగునీటి వసతి తదితర అన్ని సౌకర్యాలను సమకూర్చారు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని లక్ష్మణ చందా మామడ గౌడ కుల సంఘాల సభ్యులు కోరారు



అమ్మవారి సన్నిధిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

 బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సోమవారం భారత ఉన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారి మనుమడు విరాట్ కో అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు అంతకుముందు వీరికి ఆలయ అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు ఆలయ ఈవో విజయరామారావు అర్చకులు అమ్మవారి ప్రసాదాలను ఆశీర్వచనాలను అందజేశారు



Monday, 26 February 2024

ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం

 శ్రీ అభయాంజనేయ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్కరించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు




అయ్యప్ప స్వామికి స్వర్ణఖడ్గా బహూకరణ

 


నిజామాబాద్ పట్టణం అయ్యప్ప మందిరంలో సోమవారం శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి హంపి పీఠాధిపతులచే నిర్వహించిన చండీ హోమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి స్వర్ణఖడ్గం బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ధన్ పాలు మాట్లాడుతూ ఈ పుణ్యకార్యంలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు హరిహర సుతుని ఆశీర్వాదంతో హిందూ ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని వేడుకోవడం జరిగిందన్నారు ఈ మహాకార్యాన్ని తలపెట్టి విజయవంతంగా పూర్తి చేసిన ఆలయ కమిటీ భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు స్వర్ణ కడగానికి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తన వంతుగా ఐదు లక్షల రూపాయలు స్వామివారి స్వర్ణ కడదానికి సమర్పించడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మేయర్ దండోయ్ తో కిరణ్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ అసెంబ్లీ కన్వీనర్ లింగం భక్తవత్సలం ఆలయ కమిటీ చైర్మన్ సురేష్ గౌడ్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు

నాలేశ్వర శ్రీ రాజరాజేశ్వర ఆలయం

 నాలేశ్వర్ గ్రామంలో స్వయంభుగా వెలసిన అతి పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొని ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా నాగేశ్వర గ్రామాలయానికి విచ్చేసిన ఆకుల లలిత మున్నూరు కాపు సభ్యులు సన్మానించడం జరిగింది. జ్ఞానేశ్వర్ శ్రీ రాజరాజేశ్వరాలయానికి తమ వంతుగా అభివృద్ధి పనులకు సహాయ సహకారాలు అందించాలని కోరడంతో సానుకూలంగా స్పందించి తన వంతు సహాయాన్ని అందిస్తానని చెప్పడం జరిగింది నాగేశ్వర గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీ మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని శివరాత్రి సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాల పోస్టర్లను ఆకుల లలితా చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సభ్యులు సొసైటీ చైర్మన్ మద్దారి హనుమాన్లు మాజీ సర్పంచ్ త్యాగ సరియన్ చిన్న దొడ్డి ప్రవీణ్ కాశీ సంపత్ తోట పోతున్న సుధాకర్ ఆర్మూర్ సురేష్ మోహన్ రాకేష్ రాజు ఉన్నారు

హనుమకొండకు మేడారం హుండీలు

 మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగియడంతో జాతర సమయంలో లక్షలాదిమంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు ఈ సందర్భంగా గద్దెల ప్రాంతంలో ఏర్పాటు చేసిన హుండీలో తల్లులకు సమర్పించిన కానుకలను లెక్కించడానికి దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు సోమవారం ఆర్టిసి కార్గో బస్సులలో 512 హుండీలను హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో రాజేంద్ర మాట్లాడుతూ ఈనెల 29 నుంచి హుండీల లెక్కింపు పకడబందీగా చేపట్టనున్నట్లు తెలిపారు



ఉజ్జయినిలో ప్రపంచంలోనే తొలి వేద గడియారం

 ప్రపంచంలో తొలి వేద గడియారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 1న వర్చువల్ విధానంలో ఆవిష్కరిస్తారు భారతీయ సంప్రదాయ పంచాంగం ప్రకారం ఇది సమయాన్ని చూపిస్తుంది దీనిని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరం జంతర్మంతర్ వద్ద 85 అడుగుల ఎత్తైన టవర్ పై ఏర్పాటు చేశారు ప్రభుత్వ జీవాజీ అబ్జర్వేటరీ సమీపంలో ఇది ఉంది వైదిక పంచాంగం గ్రహాల స్థితిగతులు ముహూర్తాలు జ్యోతిష్య సూచనలు వంటి వాటిని గడియారం ప్రదర్శిస్తుంది అంతేకాకుండా భారత కాలమానం ఇండియన్ స్టాండర్డ్ టైం గ్రీన్ విచ్ మెయిన్ టైం జిఎంటి ల ప్రకారం కూడా సమయాన్ని చూపిస్తుంది



యాదగిరిగుట్టకు రెండంతస్తుల భవనం విరాళం

 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు సుమారు మూడు కోట్ల రూపాయల విలువ చేసే భవనాన్ని విరాళంగా ఇచ్చారు చైతన్యపురికి చెందిన టి శారద హనుమంతరావు దంపతులు 260 గజాల్లో నిర్మించిన రెండంతస్తుల భవనాన్ని దేవస్థానం పేరిట సోమవారం సరూర్నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ దాతలు శారద హనుమంతరావు దంపతులకు ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి ఈఓ రామకృష్ణారావు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో భాస్కర శర్మ ఏఈఓ గట్టు శ్రవణ్ కుమార్ ఆలయ అధికారులు సత్యనారాయణ శర్మ ప్రసాదు పాల్గొన్నారు



వీరభద్రేశ్వర స్వామికి అన్న పూజ

 మద్నూర్ మండలంలోని కోడి చీర గ్రామ శివారులో ఉన్న వీరభద్రేశ్వర స్వామికి భక్తులు సోమవారం ప్రత్యేక పూజ చేశారు స్వామిని అన్నంతో అలంకరించారు అన్న పూజ చేస్తే తమ కోరికలు నెరవేరుతాయి భక్తుల ప్రగాఢ విశ్వాసము ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో అన్నదానం నిర్వహించారు



తిరుమలలో ఇక నిత్య సంగీతార్చన

 తిరుమల కాలినడక భక్తులకు నిత్య సంకీర్తన అర్చన

టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయము

తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల కోసం నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు టిటిడి పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు స్థానిక అన్నమయ్య భవనంలో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోర్డు తీర్మానాలను ఈవో ధర్మారెడ్డి తో కలిసి చైర్మన్ వెల్లడించారు అలిపిరి తిరుమల కాలినడక మార్గంలోని గాలిగోపురము ఏడవ మైలు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహము మోకాళ్ళ మెట్టు వద్ద కళాబృందాలతో నిరంతరం సంకీర్తన అర్చన తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరాన్ని నిర్మించి అక్కడ కూడా నిత్యసంకీర్తనర్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపార

శ్రీవారి ఆలయంలో ద్వారపాలకులైన జయ విజయల విగ్రహాలు ఉన్న గుడి తలుపులు అరిగిపోయిన నేపథ్యంలో ఒక కోటి 69 లక్షల రూపాయలతో బంగారు తాపడంతో కొత్తవి ఏర్పాటు

శ్రీవారి వివాహ కానుకగా నాలుగు కోట్ల రూపాయలతో మంగళ సూత్రాలు లక్ష్మీకాసులు 7 డిజైన్లలో తయారు చేసేందుకు నాలుగు ప్రముఖ బంగారు ఆభరణాలు తయారీ సంస్థలకు అనుమతి

చిన్నారులలో ధార్మిక నైతిక విలువలు పెంచడంలో భాగంగా సులభ శైలిలో రూపొందించిన భగవద్గీతను తెలుగు తమిళం కన్నడ హిందీ ఆంగ్ల భాషలలో 98 లక్షల కాపీల ముద్రణకు మూడు కోట్ల 72 లక్షల రూపాయలు మంజూరు


తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు పై టీటీడీ రేటు వేసింది టీటీడీ ప్రభుత్వము అహోబిలం మఠము అర్చకులు జీయర్లపై రమణ దీక్షితులు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం తీసుకున్న టిటిడి నుంచి ఆయనను తొలగిస్తూ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు టిటిడిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది వేతనాలు పెంచుతూ పలక మండలి నిర్ణయం తీసుకున్నది శ్రీవారి ఆలయంలోని జయ విజయ ల వద్ద ఉన్న తలుపులకు ఒక కోటి 69 లక్షల రూపాయలతో బంగారు కాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు గాలిగోపురము ఆంజనేయస్వామి విగ్రహము మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇకనుంచి నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించారు తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు 4 కోట్ల రూపాయలతో నాలుగు ఐదు పది గ్రాముల తాళిబొట్టుల తయారీకి పాలకమండలి నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది ప్రతిఏటా ఫిబ్రవరి 24వ తేదీన టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు

ఈ నెల 27 న మహా కుంభాభిషేకం

 నిజామాబాద్ నగరంలో నీ కన్యకా పరమేశ్వరి ఆలయం లో మొట్ట మొదటి సారిగా మహా కుంభాభిశేకం కార్య క్రమం ఘనంగా నిర్వహించనున్నారు.ఈ కార్య క్రమానికి శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి వారి మంగళ శాసనముల తో మహా కుంభా భిషేకం ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ పురోహితులు వెలేటి గౌరీ శంకర్ శర్మ తెలిపారు . ఈ మహా కుంభాభిశేక మహోత్సవం ఈ నెల 27 వ తేదీ మంగళ వారం నుండి 29 వ తేదీ గురు వారం వరకు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం, కిషన్ గంజ్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్య క్రమం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మాత ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ ఆర్య వైశ్య సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఘనంగా వీర బ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవం

 ఇందల్ వాయి మండలం లో నీ చాంద్రాయణ పల్లి గ్రామంలో నెలకొల్పిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం గ్రామాభవృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.44 వ జాతీయ రహదారి పై నిర్మించిన ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన విషయం విదితమే .అయితే గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కెల్ల గొప్ప దేవాలయం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం యే నని అన్నారు.అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్య క్రమం లో తాజా మాజీ సర్పంచ్ లలిత దాసు ,ఉప సర్పంచ్ ప్రకాష్ , ఎర్ర గొల్ల లింగం,సంజీవ్ రెడ్డి, దేవా గౌడ్,మురళి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

 వారం రోజులుగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఫల అభిషేకాలు హోమం ద్వజారోహణం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని పల్లకి సేవలతో కన్నుల పండుగ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఆదివారంతో ముగిశాయి.

ఉత్సవాలలో భాగంగా దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టముఖి కోనేరు  లోపుణ్య స్థానాల ఆచరించి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

కొచ్చేరి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

 నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చేరి మైసమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాకుండా వివిధ మండలాల భక్తులు వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ప్రాంగణంలో  సహపంక్తి భోజనం చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు

ఒకటి న సంతోషి మాతా ఆలయ వార్షికోత్సవం

 మద్నూర్ మండలం కేంద్రం లోని సంతోషి మాతా ఆలయం లో శుక్ర వారం మార్చి ఒకటి నాడు ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు సంతోషి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుక ను విజయవంతం చేయాలని కోరారు. ధ్వజా రోహణం, కుంకుమార్చన,అభిషేకం ,యజ్ఞం,హారతి కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అర్గుల్ లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు.

 జక్రాన్ పల్లి మండలం లోని ఆర్గుల్ గ్రామం లో ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం స్వామి వారి కి అభి షేకం, దీపా రాధన , తీర్థ ప్రసాదం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమ వారం యజ్ఞం అగ్ని ప్రతిష్ట, బలి హరణం, తీర్థ ప్రసాదం వితరణ , ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.27 న స్వామి వారి కళ్యాణ మహోత్సవం,28 న సామూహిక కుంకుమార్చనలు, దొంగల దోపు కార్య క్రమం జరగనుంది.29 న జాతర, రథోత్సవం, మార్చ్ 1 న చక్ర తీర్థం,2 న స్వామి వారి నాగ వెల్లి, చక్ర స్నానం, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆచార్య తేజ చక్రవర్తుల ఆధ్వర్యం లో జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

కొలిప్యక్ లో లక్ష్మీ నరసింహ స్వామి నాగ వెల్లి, చక్ర తీర్థం.

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి రోటరీ క్లబ్లో 49వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు పోలబోయిన సత్యం మాట్లాడుతూ గతంలో పనిచేసిన అధ్యక్షులు శక్తి వంచన లేకుండా సామాజిక కార్యక్రమాలలో సేవలు చేసినందుకు క్లబ్ స్థిరంగా పటిష్టంగా ఉందని అన్నారు అనంతరం పూర్వ అధ్యక్షులను సన్మానించారు ఐదుగురు విద్యార్థులకు సైకిల్ అందజేశారు కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాజనర్సింహారెడ్డి ప్రతినిధులు శ్రీశైలం కాశీనాథం ధనుంజయ ట్రాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ బాలరాజు చంద్రశేఖర్ వెంకటరమణ కృష్ణమూర్తి కాశీనాథరావు అంజయ్య హరిస్మరణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

నేడు స్వర్ణ ఖడ్గ బహుకరణ

 నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప మందిరంలో గల అయ్యప్ప స్వామికి సోమవారం జగన్ గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా స్వర్ణ ఖడ్గ బహుకరణ నిర్వహించనున్నట్లు ఇందూరు అయ్యప్ప మందిరం అధ్యక్షుడు గడ్డం భక్తవత్సలం తెలిపారు ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతారని హిందువుల అయ్యప్ప మందిరం ప్రతినిధులు తెలిపారు మధ్యాహ్నం అన్న ప్రసాదన కార్యక్రమం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.

భిక్ నూర్ లో కొన సాగుతున్న ఎల్లమ్మ జాతర

భిక్నూర్ మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ జాతర కొనసాగుతోంది. రెండవ రోజు ఉదయం అమ్మ వారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కుంకుమార్చన , సాయంత్రం ఆలయం చుట్టు డప్పు వాయిద్యాల నడుమ ఎడ్ల బండ్లు ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా పోత రాజుల విన్యాసాలు ఆకట్టు కున్నాయి. ఎడ్ల బండ్లు ఊరేగింపు సందర్భంగా భక్తులు కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా జాగ్రత్త లు గౌడ సంఘం ప్రతినిధులు తీసు కున్నారు. ఈ కార్య క్రమం లో గౌడ సంఘం ప్రతినిధులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మైసమ్మ ఆలయంలో పూజలు

 నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో ఉన్న మైసమ్మ ఆలయంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో వనభోజనాలు చేశారు ఆల ప్రాంగణంలో జాతర కొనసాగింది


బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి

 బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి మంత్రసాధనకు ఆ సమయం ప్రశస్తమైనదని చెబుతారు ఎందుకు

తెల్లవారుజామున 320 నిమిషాల నుంచి 5:40 నిమిషాల మధ్య కాలాన్ని బ్రాహ్మణ ముహూర్తం అంటారు మనిషికి జ్ఞానాన్ని అందించే అద్భుత కాలం బ్రహ్మీ ముహూర్తం సాధారణంగా ప్రతిఘటకు గ్రహ హోరా మారుతుంది అంటే క్షితిజ రేఖ దగ్గర ఆగ్రహం కనిపిస్తుందని అర్థము హోరాకాలానికి అతిధివత అయిన గ్రహం మనం చేసే పనులను నిర్దేశిస్తుందని జ్యోతిష్యం చెబుతుంది తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంపై ఏ గ్రహాల ప్రభావము ఉండదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరకు సైతం అతీతమైన సర్వచైతన్యమయమైన అమ్మవారి శక్తి మాత్రమే ఈ కాలంలో ప్రభావంతంగా ఉంటుంది ఆసక్తికి రూప గుణాలు ఉండవు అది శుద్ధ చైతన్యం కేవలం జ్ఞాన స్వరూపం అందుకే తెల్లవారుజామున నేర్చుకున్న విద్య హృదయానికి హత్తుకుంటుంది బాగా జ్ఞాపకం ఉంటుంది ఏకాగ్రత కుదురుతుంది వాక్ శుద్ధి కలుగుతుంది అందుకే చదువు కు జప సాధనలకు బ్రాహ్మీ ముహూర్తాన్ని మించింది లేదని పెద్దలు చెబుతుంటారు.

హజ్ యాత్రకు 7811 మంది ఎంపిక షబ్బీర్ అలీ

 తెలంగాణ రాష్ట్రం నుంచి హత్యయాత్రకు వెళ్లేందుకు హాజ కమిటీ కోటాలో 7811 మంది హాజీలు ఎంపికయ్యారని రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అని తెలిపారు ఆదివారం పాత మలక్పేట డివిజన్లోని హైటెక్ గార్డెన్స్ లో హాజీ యాత్రికుల అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు తెలంగాణ హాజ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ హజ్ యాత్ర కోసం 11313 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు

నేడు రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం

 దోమకొండ మండల పరిధిలోని ముత్యంపేట గ్రామంలో ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి సోమవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు గౌడ సంఘం ప్రతినిధులు భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

26 న సోమ వారం ఉదయం 9 గంటలకు శ్రీ విఘ్నేశ్వర పూజ, సాయంత్రము 5 గంటలకు అమ్మ వారి ఊరేగింపు ( శావ),27 న మంగళ వారం సాయంత్రము 4 గంటల నుంచి బోనాల ఊరేగింపు ,28 న బుధ వారం చక్కెర తీర్థం జాతర కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి అని తెలిపారు. మూడు రోజులపాటు రాత్రి 8 గంటల నుంచి శ్రీ సింగ రాయ పల్లి అంజయ్య శిష్యుల బృందం చే శ్రీ రేణుకా ఎల్లమ్మ ఒగ్గు కథ ఉంటాయని తెలిపారు. కార్య క్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షుడు ముత్తగారి శిరీష్ గౌడ్,సభ్యులు చిన్న పోషా గౌడ్, ఎ. స్వామి గౌడ్, ఎం మోహన్ గౌడ్, ఎం సిద్దా గౌడ్, ఎం గోపాల్ గౌడ్, స్వామి గౌడ్ పాల్గొన్నారు.

ఘనంగా మహా పడిపూజ

 కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో మల్లికార్జున సిండికేట్ ఆధ్వర్యంలో ఆదివారం మహా పడిపూజను ఘనంగా నిర్వహించారు గురుస్వాములు జమాల్పూర్ భుజంగరావు గట్ల బాలుతో కలిసి 120 మంది శివమాల దారులు పడిపూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్చకులు జంగం వికాస్ గ్రామస్తులు నెట్టు నారాయణరావు లడ్డూరి లక్ష్మీపతి యాదవ్ ఉరుదుండ నరేష్ నీలం వెంకటేష్ మామిండ్ల అంజయ్య కౌన్సిలర్లు కాసర్ల గోదావరి పోలీసు కృష్ణాజి రావు శివమాల దారులు తదితరులు పాల్గొన్నారు



రాజగోపుర నిర్మాణానికి విరాళం

 కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నెలకొని ఉన్న శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయ రాజగోపుర నిర్మాణానికి బోడపుంటి సురేఖ కాశీనాథ్ దంపతులు పదివేల ఒక వంద పదహారు రూపాయల విరాళం అందజేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ పాలకుర్తి శేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు భావి శరత్చంద్ర శర్మ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ఆలయ రాజగోపుర నిర్మాణానికి భక్తులు ఇదోదికంగా విరాళాలు అందజేసి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ఆలయ కమిటీ వర్గాలు కోరాయి.

అభయమిచ్చే అనంతపద్మనాభుడు

 భక్తుల కొంగుబంగారము అనంత పద్మనాభ స్వామి ఆలయం రేపటి నుంచి వారం రోజులపాటు ఆలయ బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు చేస్తున్న లక్ష్మాపూర్ మల్కాపూర్ ఏ గ్రామస్తులు

నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ ఏ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ అంత పద్మనాభ స్వామి ఆలయం భక్తులకు బంగారంగా ప్రసిద్ధికి ఎక్కింది భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం గ్రామ శివారు గుట్ట ప్రాంతంలో ఒక గుహలో నరసింహస్వామి రూపంలో వెలసిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు వృత్తాకారంలోనే శంఖ చక్రధారుడిగా వెలసి దినదినం తన రూపాన్ని పెంపొందించుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తున్నాడు అనంత పద్మనాభ స్వామి ఆలయ ఉత్సవాలు ఈనెల 27వ తేదీ నుండి మార్చి మూడు మూడవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఇందుకోసం లక్ష్మాపూర్ మల్కాపూర్ ఏ గ్రామాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు ఏటా మాఘమాసంలో తదియ నుండి నష్టం వరకు వారం రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు

చిన్న బిందు రూపంలో వెలసిన శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి క్రమక్రమంగా పెరుగుతూ పూర్తి రూపాన్ని సంతరించుకున్నాడు ఇరుకైన రాళ్ల మధ్యలో శంకు చక్రం వక్షస్థల వాయాంశంపై కొలువు దీరిన శ్రీ లక్ష్మీ సహిత అనంతపద్మనాభుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారి నిజరూపం గుహలో ఇరుకైన రాళ్ల మధ్యలో చిన్న ఖాళీ స్థలంలో ఉన్నది భక్తుల సౌలభ్యం కోసం అదే గుహలో కింది భాగంలో మరో విగ్రహాన్ని ప్రతిష్టించారు వేటా భాద్రపద మాసంలో అనంత చతుర్దశి రోజున నిర్వహించే అనంతపద్మనాభుడి వ్రతం అత్యంత శక్తివంతమైనదని భక్తుల విశ్వాసం పవిత్రమైన దీక్షతో ఏడు శిరస్సులు కలిగిన సర్ప రూపంలో అనంత పద్మనాభ స్వామిని ప్రతిష్టించి ఆ ప్రతిమను 16 నూలు పోగులతో తయారు చేసిన మాలను అలంకరించి అత్యంత పవిత్రంగా నియమనిష్ఠలతో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వ్రతాన్ని ఆచరిస్తున్నారు 27వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుండి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవనున్నాయి మొదటిరోజు అంకురారోహణ రుత్వికుల దీక్ష ధారణ హారతి మంత్రపుష్పం 28వ తేదీన సుప్రభాత సేవ ధ్వజారోహణం 29వ తేదీన మధ్యాహ్నం శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి కల్యాణోత్సవం మార్చి ఒకటవ తేదీన డోలారోహణం రెండవ తేదీన రథోత్సవం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు మూడవ తేదీన ఉదయం పూర్ణాహుతి చక్రతీర్థము నాగవెల్లి బాదషా వర్ణ పూజ సప్తావరన పూజలు దేవతా ఉద్వాసన భూత బలి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం అవుతాయి జాతర సహకారంతో అష్టముఖి కోనేరు నిర్మాణం నలుగురు దాతలు అందించిన విరాళాలతో ఆలయ ఆరణాలు మూడు లక్షల రూపాయలతో అష్టముఖి కోనేరుగా కొత్తగా నిర్మించారు ఈ కోనేరు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి గ్రామ పెద్దలతో కలిసి సందర్శించారు 60 లక్షల రూపాయలతో బిటి సిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఆలయ ముఖద్వారం నుండి ఆలయం పై వరకు ఆలయ ఆవరణలో సిసి రోడ్డును నియమించనున్నారు