తొలిసారిగా సమర్పించిన రేవంత్ సర్కార్ నంద్యాల జిల్లాలో ప్రముఖ విష్ణు క్షేత్రమైన అహోబిలం నరసింహస్వామికి తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా పట్టు వస్త్రాలను సమర్పించింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ గద్వాల జిల్లా జోగులాంబ దేవస్థానం ఈవో పురంధర్ కుమారులు బుధవారం సంప్రదాయ బద్దంగా పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా అహోబిల క్షేత్ర అధికారులు అర్చకులు స్పందించారు కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు శైవ భక్తుడని రుద్రవరంలో ఒక సూర్యోదయాన శివలింగాన్ని పూజిస్తుండగా శివలింగంలోని నరసింహస్వామి రూపం కనిపించిందని తెలిపారు కాకతీయ కాలం నుంచి స్వామికి కైంకర్యం చేసేవారని తెలంగాణ నుంచి పూర్వం దేవస్థానానికి కైంకర్యాలు వందేవని పేర్కొన్నారు ఆ సంప్రదాయాన్ని తిరిగి తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం లక్ష్మీనరసింహస్వామికి పట్టు వస్త్రాల సమర్పణతో ప్రారంభించినట్లు అధికారు లు వెల్లడించారు
No comments:
Post a Comment