మాక్లూరు మండలంలోని గ్రామ శివారులో శనివారం పౌర్ణమి సందర్భంగా నాగేంద్రుడికి పచ్చని పందిరి వేసి కళ్యాణ మహోత్సవం పూజలు నిర్వహించామని రంగారావు సుబ్బారావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ముల్లంగి బొంకన్పల్లి తదితర గ్రామాల నుంచి భక్తులు మహిళలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని నాగేంద్రుడు ఆశీస్సులు పొందారు ఆలయ కమిటీ వారు భక్తులకు పసుపు కుంకుమల గాజులు ఇవ్వడం ఆచారంగా సాగుతుందని తెలిపారు ఆలయం వద్ద జాతరలు నగేంద్రుడి విగ్రహాల ఊరేగింపు చేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బూరుల అశోక్ గ్రామ సర్పంచ్ శ్యామ్ రావు పావని మాజీ సర్పంచ్ సురేందర్ బాబు ముల్లంగి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ,అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
No comments:
Post a Comment