డిచ్పల్లి మండలంలోని కిల్లా రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవ వేడుకలు ప్రధాన అర్చకుడు సుమిత్ శర్మ దేశ్ పాండే ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్నాయి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఘనంగా గరుడోత్సవం నిర్వహించారు ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు అంతకు హోమం బలిహరణం నిర్వహించారు రాత్రికి గరుడ వాహనంపై గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఉత్సవ మూర్తులతో ఊరేగించారు ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య సభ్యులు గడ్డం నర్సారెడ్డి సున్నం పోశెట్టి సూర మాధురి ప్రసాదిచితేందర్ మాజీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి భూష సుదర్శన్ ఏజీ దాసు మాజీ విండో చైర్మన్ జైపాల్ యుటిసి సభ్యులు చిన్నసైలు వారాల సాయిలు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి దువ్వ నర్సింలు గ్రామస్తులు పాల్గొన్నారు నేడు రథోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు
No comments:
Post a Comment