Saturday, 24 February 2024

శ్రీ గాడి మాకుల రాజరాజేశ్వర స్వామి మహోత్సవాలు ప్రారంభం

 సిరికొండ మండలం రావుట్ల గ్రామ పరిధిలోని శ్రీశ్రీశ్రీ గాడి మాకుల రాజరాజేశ్వర స్వామి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి తొలిరోజు ఉదయం అఖండ దీపారాధన శ్రీ మహాగణపతి పూజ శివాభిషేకం అమ్మవారికి ఒడిబియ్యం నవగ్రహ పూజ హోమము బలి ప్రధానము నిర్వహించారు అలాగే సాయంత్రం స్వామివారి రథోత్సవం నిర్వహించారు అంతకుముందు స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ వారు అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు శనివారం ఉదయం 8 గంటల నుంచి స్వామివారి తీర్థ ప్రసాదాల వితరణ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు చెప్పారు అలాగే సాయంత్రం స్వామివారి పల్లకి సేవ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు స్వామి వారిని గ్రామంలో పల్లకిలో ఊరేగించనున్నట్లు ఆలయ కమిటీ వారు చెప్పారు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇంటి ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ గాడిమాకుల రాజరాజేశ్వర స్వామిని ఆయన తనయుడు ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా జగన్ వెంట బిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు

No comments:

Post a Comment