Tuesday, 27 February 2024

భక్తిశ్రద్ధలతో చండీ హోమము

 


నిజామాబాద్ నగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో మొట్టమొదటిసారి మహాకుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా గణపతి హోమం చండీ హోమం భక్తీశ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పురోహితులు వేలేటి గౌరీ శంకర శర్మ హాజరై అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మహా కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా మంగళవారం గోపూజతో పాటు గణపతి హోమం 128 కళాశాల పూజ కుంభాభిషేకం సంప్రోక్షణ 108 జంటలు పాల్గొనడం జరిగిందని తెలిపారు ఆ కలశాల నీరు అమ్మవారికి అభిషేకంగా చేసి ఆ కలశాలను దాతలకు ప్రసాదంగా ఇవ్వడం జరిగింది అన్నారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సాయంత్రం భక్తిశ్రద్ధలతో చండీ హోమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి దయా నగర ప్రజలపై ఉండాలని భక్తిశ్రద్ధలతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ సభ్యులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు అధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ గుప్తా ప్రధాన కార్యదర్శి రవికుమార్ గుప్తా కోశాధికారి రాఘవేంద్ర గుప్తా ఉపాధ్యక్షులు నరేందర్ గుప్తా రాజేందర్ గుప్తా రుక్మిణి ప్రసాద్ గుప్తా కరుణాకర్ గుప్తా చంద్రశేఖర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment