Tuesday, 27 February 2024

అయోధ్యలో బిక్కనూరు దంపతుల సేవ

 అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా భాగ్యనగర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం సేవలో భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన దంపతులిద్దరూ నెలరోజులుగా సేవలు అందిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన శనిశెట్టి వెంకటేశం గుప్తా సుభద్ర గత నెల 25వ తేదీన అయోధ్యకు చేరుకున్నారు అక్కడ భాగ్యనగర్ సేవాసమితి ఆధ్వర్యంలో భక్తులకు నిర్వహిస్తున్న అన్నదానంలో వారు పాలు పంచుకుంటున్నారు అంతేకాకుండా భక్తులు అన్నదానానికి అవసరమైన సామాగ్రిని కూడా తెప్పిస్తూ శ్రీరాముడు సేవలో తరిస్తున్నారు సోమవారం శని శెట్టి వెంకటేశం గుప్తా సుభద్రలు ఫోన్లో మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడిని దర్శనం అద్భుతం అని అన్నారు ప్రతిరోజు భాగ్యనగర్ సేవా సమితి ఆధ్వర్యంలో 30 వేల మంది భక్తులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ అందజేస్తున్నామన్నారు.

No comments:

Post a Comment