Monday, 26 February 2024

అక్క కొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి

 కడెం మండలంలోని దిల్దార్ నగర్ గ్రామ పరిధిలోని శ్రీ అక్కకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు ముందుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు అక్కడే ఉన్న ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీనరసింహస్వామి ఆలయం పరిధిలో ఉన్న సమస్యలను విన్నవించగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల మల్లేష్ జిల్లాల నాయకులు సతీష్ రెడ్డి తక్కల సత్యనారాయణ నరేందర్ రెడ్డి గొల్ల వెంకటేష్ పై గల భూషణ్ ఆలయ కమిటీ చైర్మన్ రాజా రమేష్ ఆలయ కమిటీ సభ్యులు వివిధ గ్రామాల ప్రజలు నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment