దోమకొండ మండల పరిధిలోని ముత్యంపేట గ్రామంలో ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి సోమవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు గౌడ సంఘం ప్రతినిధులు భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
26 న సోమ వారం ఉదయం 9 గంటలకు శ్రీ విఘ్నేశ్వర పూజ, సాయంత్రము 5 గంటలకు అమ్మ వారి ఊరేగింపు ( శావ),27 న మంగళ వారం సాయంత్రము 4 గంటల నుంచి బోనాల ఊరేగింపు ,28 న బుధ వారం చక్కెర తీర్థం జాతర కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి అని తెలిపారు. మూడు రోజులపాటు రాత్రి 8 గంటల నుంచి శ్రీ సింగ రాయ పల్లి అంజయ్య శిష్యుల బృందం చే శ్రీ రేణుకా ఎల్లమ్మ ఒగ్గు కథ ఉంటాయని తెలిపారు. కార్య క్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షుడు ముత్తగారి శిరీష్ గౌడ్,సభ్యులు చిన్న పోషా గౌడ్, ఎ. స్వామి గౌడ్, ఎం మోహన్ గౌడ్, ఎం సిద్దా గౌడ్, ఎం గోపాల్ గౌడ్, స్వామి గౌడ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment