యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు సుమారు మూడు కోట్ల రూపాయల విలువ చేసే భవనాన్ని విరాళంగా ఇచ్చారు చైతన్యపురికి చెందిన టి శారద హనుమంతరావు దంపతులు 260 గజాల్లో నిర్మించిన రెండంతస్తుల భవనాన్ని దేవస్థానం పేరిట సోమవారం సరూర్నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ దాతలు శారద హనుమంతరావు దంపతులకు ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి ఈఓ రామకృష్ణారావు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో భాస్కర శర్మ ఏఈఓ గట్టు శ్రవణ్ కుమార్ ఆలయ అధికారులు సత్యనారాయణ శర్మ ప్రసాదు పాల్గొన్నారు
No comments:
Post a Comment