Sunday, 25 February 2024

కమ్మర్పల్లిలో ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణోత్సవం

 కమ్మర్పల్లి మండల కేంద్రం శివారులోని శ్రీగిరిగుట్టపై సతీసమేతంగా కొలువుతీరిన కాలజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణోత్సవం శనివారం ఉదయం అత్యంత భక్తిశ్రద్ధలతో కనుల పండుగగా నిర్వహించారు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు నూనె అనిల్ శర్మ బ్రహ్మంగారి మఠం నుంచి వచ్చిన పూజారుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజ స్వామి వారి కళ్యాణం ఉత్సవ కార్యక్రమాన్ని శాస్త్ర ఉప్తంగా వేదమంతో చారణల మధ్య ఘనంగా నిర్వహించారు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించారు భక్తురు స్వామివారికి కర్ణ కానుకలు సమర్పించుకున్నారు వీడిసి అధ్యక్షుడు అంగిరేకుల మల్లేష్ యాదవ్ ఉపాధ్యక్షుడు గండికోట సాయిరాం కార్యదర్శి కోశాధికారి కుమ్మరి భూమేశ్వర్ దంపతులు వీడిసి సభ్యులు స్వామి వారికి పట్ట వస్త్రాలను సమర్పించారు ప్రత్యేక పూజా కళ్యాణం లో పాల్గొన్నారు జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వీడీసీ సభ్యులు తాగునీరు తదితర ఏర్పాట్లు చేశారు స్వామివారి కల్యాణోత్సవ అన్నదాన కార్యక్రమాలలో గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం స్వామి మాజీ ఉపసర్పంచ్ గంగారావు ఎంపీటీసీ మైలారం సుధాకర్ గ్రామస్తులు యువజన సంఘాల సభ్యులు మహిళలు పాల్గొన్నారు. రాత్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి స్వామి వారి రథోత్సవ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు

No comments:

Post a Comment