Sunday, 25 February 2024

తరలి వెళ్లిన వన దేవతలు

 


ముగిసిన మేడారం మహా జాతర వచ్చే బుధవారం తిరుగు వారం పండుగ

మేడారం మహా జాతర శనివారం రాత్రి దేవతల వన ప్రవేశం తో ముగిసింది నాలుగు రోజులుగా భక్తులకు దర్శనాలు ఇచ్చిన దేవతలను ఆదివాసి పూజారులు సంప్రదాయ బద్దంగా వన ప్రవేశం చేయించారు పూజారులు ధూపదీప నైవేద్యాలు సమర్పించి సారాలమ్మను కన్నెపల్లి ఆలయంలో గోవిందరాజులు ఏటూరునాగారం మండలం కొండాయిలోని ఆలయంలో తిరిగి ప్రతిష్టించారు పగిడిద్దరాజుతో పూజారులు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల కు రాత్రి కాలినడకన బయలుదేరారు 60 కిలోమీటర్ల దూరం కొనసాగే వీరి పాదయాత్ర ఆదివారం ఉదయం చేరుకుంటుంది అత్యంత కీలకమైన సమ్మక్క వాన ప్రవేశం ఘట్టం శనివారం రాత్రి జరిగింది చిలకలగుట్ట వైపు బయలుదేరిన అమ్మకు మంత్రి సీతక్కతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కలెక్టర్ పార్టీ ఎస్పీ శబరి ఘనంగా వీడ్కోలు పలికారు అనంతరం పూజారిలో కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు వనంలోకి తీసుకెళ్లి వన ప్రవేశం ఘట్టాన్ని ముగించారు దీనితో ప్రధాన జాతర పరిసమాప్తమైనది ఈనెల 28న తిరుగువారం పండగ నిర్వహించనున్నారు జాతరకు వచ్చిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ అమ్మవార్లకు మొక్కులు చెల్లించార

సమ్మక్క సారలమ్మలకు ఈనెల 28న పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు మహా జాతర ముగిసిన తర్వాత ఇలా తిరుగువారం పండుగ సంప్రదాయ బద్దంగా నిర్వహిస్తామని జాతరకు వచ్చిన భక్తులు చల్లంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటామని పూజారులు తెలిపారు తిరుగువారం పండుగ సందర్భంగా బుధవారం మేడారం గ్రామస్తులు ఆదివాసీలు పూజారుల కుటుంబీకులు ఇళ్లకు ఇళ్ళను అలికి శుద్ధి చేస్తారు సమ్మక ప్రత్యేక పూజలు చేస్తారు మేడారంలోని సమ్మక్క కనేపల్లిలోని సరళమ్మ గుడి వద్ద అమ్మవార్లను దర్శించుకుని ముక్కులు చెల్లించుకుంటారు పూజారులు జాతర సమయంలో తమకు ఆహ్వానించిన బంధువులకు కొత్త వస్త్రాలు పెట్టి సాగనంపుతాడు మేడారం మహా జాతర తిరిగి 2026 మాఘమాసంలో జరగనున్నది

గద్దెని వీడి వన ప్రవేశం చేసినది ఇలా

ఐదు గంటల పది నిమిషములకు గోవిందరాజులు, ఐదు గంటల 30 నిమిషములకు పగిడిద్దరాజు, ఏడు గంటల 27 నిమిషములకు సమ్మక్క వన ప్రవేశం, 740 నిమిషములకు సారలమ్మ వన ప్రవేశం.

 ఆనవాయితీ ప్రకారం తోలుతగా గోవిందరాజులు పగిడిద్దరాజులను గద్దెల మీద నుంచి సాగనంపుతారు వారు వెళ్లగానే సమ్మక్క వన ప్రవేశ కార్యక్రమం ఉంటుంది చివరిగా సార్లలమ్మని తీసుకెళ్తారు.




No comments:

Post a Comment