Monday, 26 February 2024

లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో రద్దీ

 


మేడారం నుండి యాదాద్రి కి పోటెత్తిన భర్త జనం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడు దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో రద్దీ పెరిగింది ఆదివారం వారాంతపు సెలవు దినంతో పాటు తెలంగాణ కుంభమేళా అయిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగియడంతో అమ్మవారి దర్శనార్థం వెళ్లిన భక్తులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ దర్శనానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు శనివారం సాయంత్రం నుండి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం తెల్లవారుజామున ఆలయం తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ అభిషేకం అర్చన పూజలు చేసి భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు శ్రీవారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులు ఆలయంలో జరుగు నిత్య పూజలు కళ్యాణం సువర్ణ పుష్పార్చన అష్టోత్తర పూజలతో పాటు శ్రీ సత్యనారాయణ వ్రత పూజలు భకలు పాల్గొని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనానికి భక్తులతో కొండపైన కొండ కింద కిటకిటలాడింది కొండపైన శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు శ్రీ స్వామివారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు భద్రాచలం శ్రీ లక్ష్మీనరసింహారెడ్డి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు శ్రీవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు.

No comments:

Post a Comment