Thursday, 29 February 2024

ఖండేరాయుడి కళ్యాణ మహోత్సవం

 





భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ 

సదాశివ నగర్ మండలంలోని ఉత్తనూర్ గ్రామంలో ఖండేరాయ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఖండేరాయ మహాదేవుని మాండాలమ్మ కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళ్యాణ వేడుకలకు వివిధ గ్రామాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు వేడుకలకు ముందు పట్టు వస్త్రాలను శ్రీ హనుమాన్ మందిరం నుంచి భాజా భజంత్రీల మధ్య ఊరేగింపుగా భక్తిశ్రద్ధలతో ఆలయం వద్దకు తీసుకువచ్చి వేడుకలు జరిపారు భక్తులకు భారీ ఎత్తున అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ దొడ్ల రవి మాజీ సర్పంచ్ మోతే సాయప్ప రాములు ఎంపీటీసీ రామచంద్రరావు విండోస్ చైర్మన్ ప్రభాకర్ రావు ఉపసర్పంచ్ శివ పాటిల్ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గుడ్ల శ్రీకాంత్ రావు కాంగ్రెస్ బిజెపి నాయకులు పాల్గొన్నారు. శ్రీ కండేరాయుని కళ్యాణ వేడుకలలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్న ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో. సదాశివ నగర్ మాజీ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి ఉపసర్పంచ్లు శివ పాటిల్ వంకాయల రవి టిఆర్ఎస్ రవి అబ్బ సంజీవులు శ్రీకాంత్రావు రాజు వినోద్ శ్రీనివాస్ నాయక్ పరమేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు






No comments:

Post a Comment