జాతరకు ప్రత్యేక బస్సులు
తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర లోపల కొన్ని భక్తులు సందర్శకుల కోసం రాష్ట్ర పర్యాటక సంస్థ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది నాలుగు రోజుల పాటు ఉదయం 6:30 గంటలకు సికింద్రాబాద్ యాత్రి నివాస్ బషీర్బాగ్ సెంటర్ రిజర్వేషన్ కార్యాలయం నుంచి ఏసీ నాన్ ఏసీ వోల్వో బస్సులు బయలుదేరుతాయని పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ నాయుడు తెలిపారు ఈ బస్సుల్లో వెళ్లే భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసినట్లు వివరించారు దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో పర్యాటకులకు వరంగల్ వేయి స్తంభాల గుడి పరిసర ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు తెలుగు ప్రయాణంలో రాత్రి పదిన్నర గంటలకు హైదరాబాద్ చేరుకోవచ్చని అన్నారు ఒక రోజులోని దర్శనం పూర్తిచేసుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పర్యటన ప్రత్యేక బస్సులను వినియోగించుకోవచ్చని సూచించారు మేడారం జాతర బస్సులో చార్జీలు ఈ విధంగా ఉన్నాయి పెద్దలకు 1800 రూపాయలు పిల్లలకు 1440 ఏసీ మినీ బస్సులో కైతే పెద్దలకు 1600 రూపాయలు పిల్లలకు 1280 నాన్ ఎసి బస్సులోనైతే పెద్దలకు 1200 రూపాయలు పిల్లలకు 950 రూపాయలు ఛార్జీలుగా నిర్ణయించారు.
తల్లుల రాక కోసం ముస్తాబైన మేడారం నేడు కన్నెపల్లి వెన్నెల సారలమ్మ పూసుకుండ్ల నుంచి పగిడిద్దరాజు కొండాయి నుంచి గోవిందరాజుల రాక సమ్మక్క సారలమ్మ తల్లి రాకకు విస్తృత ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క
కోట్లాదిమంది భక్తుల కొంగుబంగారం ఆదివాసీల ఇలవేల్పులు భక్తికి విశ్వాసాలకు ప్రతీకైన మేడారం సమ్మక్క సారలమ్మ ప్రధాన జాతరకు సరళమ్మ రాకతో అంకురార్పణ జరుగుతోంది తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం తల్లుల రాక కోసం ముస్తాబయింది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర నాగ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తారు ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తడువాయి మండలం మేడారంకు గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర విశ్వవ్యాప్తమైంది మన దేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా తో పాటు యావత్ భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు ఈసారి మేడారం జాతరకు రెండు కోట్ల మంది భక్తులు వచ్చి తల్లులను దర్శించుకోబోతున్నారు అందుకు అనుకూలంగానే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది తల్లులు కొలువుదీరే మేడారంతో పాటు కన్నెపల్లిలోని సార్లమ్మ గుడి గళ్ళలోని పగిడిద్దరాజు గుడి కొండాయిలోని గోవిందరాజుల గుడిని అందంగా ముస్తాబు చేశారు తల్లులు రాకకు సంబంధించిన ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్వయంగా దగ్గరుండి పరిశీలిస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆదివాసి సంప్రదాయాలకు వివాదం కలగకుండా అన్నింటిని అధికారులకు ఎక్కడికి అక్కడ సూచనలు చేస్తూ తానే స్వయంగా వెళుతున్నారు
కన్నెపల్లి నుంచి సారలమ్మ
మేడారం గ్రామానికి పశ్చిమ వైపున జంపన్న వాగుకు అవతల ఉన్న కన్నెపల్లి గ్రామంలోని సారాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలను సరళమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య నేతృత్వంలో సారలమ్మను ఆదివాసి గిరిజన సంప్రదాయాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు బుధవారం సాయంత్రం పూజా కార్యక్రమాలు అనంతరం సరళమ్మను తన తల్లి సమ్మక్క వద్దకు పంపిస్తారు కన్నెపల్లిలోని ప్రతి గడప తొక్కుతూ అందరి అనుమతితోనే మేడారం వెళ్తుండగా చీర శారీలతో పాటు పసుపు కుంకుమ ఇచ్చి సాగనంపుతారు కన్నెపల్లి నుంచి వస్తూ మార్గమధ్యంలో సంపెంగ వాగు జంపన్న వాగు వద్ద తమ్ముడు జంపన్న ముద్దాడుతూ ప్రశ్నలతో ఒకరినొకరు పలకరింపులు చేసుకుంటూ తన బాగోగులు తల్లి సమ్మక్క తండ్రి పగిడిద్దరాజుకు చెప్పమంటూ జంపన్న అక్క సారల అమ్మకు చెప్పి సాధారణంగా సాగనంపుతారు సారలమ్మ గద్దెపై కొలువు తీరడంతో జాతర ప్రారంభమవుతుంది
ఆడబిడ్డ రాక కోసం భక్తుల ఎదురుచూపులు
ఆదివాసీల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మల జాతరలో భక్తుల కొంగుబంగారంగా కన్నెపల్లి వెన్నెలగా పిలిచే ఆదివాసీల ఆడబిడ్డ సారలమ్మ రాక కోసం మేడారం ఎదురుచూస్తోంది సారాలమ్మను కన్నెపల్లి నుంచి నడచ్ వస్తున్న గా కనులారా చూడాలని భక్తులు వేల కళ్ళతో ఎదురుచూస్తున్నారు
పునుగండ్ల నుంచి పగిడిద్దరాజు
సమ్మక్క గద్దల పైకి రాకకు ముందే పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగండ్ల గ్రామం నుండి పగిడిద్దరాజు ప్రధాన పూజారులు వెనక రాజేశ్వర్ పెనక సురేందర్ ఆధ్వర్యంలో సోమవారం బయలుదేరి కాలినడకన వస్తున్నారు గోవిందరావుపేట మండలం కర్లపల్లి వద్ద బస చేసి వేలు బాగా పడిగాపూర్ పరిసరాలకు చేరుకుంటారు సార్ ఎల్లమ్మ గద్దెలపై కొలువు తీరడానికి ముందే వచ్చి పగిడిద్దరాజు గద్దెలపై కొలువు తీరుతారు
కొండాయి నుంచి గోవిందరాజులు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలోని గోవిందరాజుల ఆలయంలో ప్రధాన పూజారి దెబ్బ గట్ల గోవర్ధన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం ఉదయమే ప్రారంభమై సాయంత్రానికి కొండాయి నుంచి అడవి మార్గం నుంచి కాలినడకని తీసుకొచ్చి వచ్చిండా మేడారంలోని గద్దెపై ప్రతిష్టిస్తారు
తల్లుల రాక కు విస్తృత ఏర్పాట్లు
ఫిబ్రవరి 21 నుంచి జరిగే ప్రధాన జాతరకు ప్రభుత్వం అధికారం విస్తృత ఏర్పాట్లు చేశారు మేడారంలోని సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బుధవారం కన్నెపల్లి నుంచి పగిడిద్దరాజును కొండాయ నుంచి గోవిందరాజులను తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గురువారం సమ్మక్కొని తీసుకొచ్చి ఎందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు జాతరలో ఆదివాసి గిరిజన సంప్రదాయాలకు ఎక్కడ విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ములుగు జిల్లా కలెక్టర్ నాగారం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు జాతరలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాతర సజావుగా సాగేందుకు గతంలో జాతరలో పనిచేసిన ఇద్దరు సీనియర్ అధికారులు ఆర్మీ కృష్ణా ఆదిత్య అభిలాష సురభి రంగారెడ్డి జిల్లా అదన కలెక్టర్ ప్రతిమ సింగ్ హనుమకొండ అదనపు కలెక్టర్ రాధిక గుప్తాను నియమించారు
తెలుగులో రాకలో భాగస్వామ్యం అవుతున్న మంత్రి సీతక్క
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో ప్రధాన భూమిక పోషిస్తున్న మంత్రి సీతక్క దగ్గర ఉండి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ పకిడిత రాజు గోవిందరాజులను తీసుకువచ్చే సందర్భంలో అన్ని ప్రాంతాలకు స్వయంగా వెళ్లి పూజ కార్యక్రమాలలో పాల్గొని దగ్గరుండి తీసుకొచ్చేవారు ఈసారి జాతర కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి హోదాలో సీత కన్నీటిని తానే స్వయంగా నిర్వహిస్తున్న విషయం తెలిసింది రెండు రోజులు ముందుగానే సీతక్క గంగారం మండలం పూనుగండ్ల నుంచి పకిడిత రాజు తీసుకురావడానికి వెళ్లారు అక్కడ పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే బుధవారం ఏటూరు నాగారం మండలం కొండయి కూడా వెళ్లి . అక్కడ పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే బుధవారం ఏటూరునాగారం మండలం కొండాయి కూడా వెళ్లి గోవిందరాజుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోవిందరాజులను తీసుకొస్తారు బుధవారం కన్నెపల్లి గ్రామం నుంచి సార్లమ్మ గుడిలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొని దగ్గరుండి తీసుకొస్తారు గురువారం కూడా చిలకలగుట్టపై నుంచి సమ్మక్క గద్దల పైకి తీసుకొచ్చి ప్రధాన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొంటారు.
No comments:
Post a Comment