ఎక్సైజ్ శాఖ నిబంధనలు.. మేడారం సమ్మక్క సారలమ్మ మొక్కులు ప్రధానమైంది ఎత్తు బంగారం బెల్లం ప్రతి జాతర సమయంలో రూ కోట్లలో వ్యాపారం జరుగుతుంది గుడుంబా తయారీకి బెల్లం పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు ఆ బంగారం కొనుగోలు పై ఎక్సైజ్ అధికారులు కొన్ని నిబంధనలు పెట్టారు వ్యాపారులు భక్తుల నుంచి తప్పనిసరిగా ఆధార్ కార్డు నకలు ఫోన్ నంబరు ఇంటి చిరునామా తీసుకోవాలని నిజంగా మొక్కుకోసమే కొనుగోలు చేస్తున్నారా లేదా అనే వివరాలను సేకరించాలని ఆదేశించారు కొనుగోలు చేసిన వారి పూర్తి వివరాలతో ప్రతిరోజు విక్రయాల రిపోర్టు అందజేయాలని వ్యాపారులకు స్పష్టం చేశారు వ్యాపారులు తమ దుకాణాల ముందు కొనుగోలుదారులు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలంటూ ఫ్లెక్సీలు వంటివి పెట్టారు
వెయ్యి టన్నుల బెల్లం.. రెండేళ్లకోసారి జరిగే జాతరలో భక్తులు మొక్కుగా చెల్లించి ఎత్తు బంగారం సుమారు 1000 టన్నుల వరకు ఉంటుంది గత జాతరలో ఎనిమిది వందల టన్నులు వచ్చినట్లు అంచనా బెల్లం పక్కదారి పట్టకుండా కొనుగోలుదారుల నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోవాలని వ్యాపారులకు చెప్పాను గుడుంబా తయారీకి విక్రయించి నట్లు తెలిస్తే సంబంధిత వ్యాపారులకు లక్ష రూపాయల జరిమానా విధిస్తామని మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపర్ ఇంటెండెంట్ కిరణ్ నాయక్ తెలిపారు
No comments:
Post a Comment