Wednesday, 21 February 2024

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన

 సిరికొండ మండలంలోని పెద్ద వాల్కోట్ గ్రామంలో సోమవారం వేద పండితుల సమక్షంలో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు ఈ సందర్భంగా గౌడ గీత పారిశ్రామిక సంఘ సభ్యులు మాట్లాడుతూ మా సంఘం తరఫున వాల్ బోట్ గిర్నీ కార్నర్ వద్ద మా కుల దైవం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి విగ్రహాన్ని నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి తాత్కారికంగా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వారు చెప్పారు త్వరలో తాత్కాలికంగా ప్రతిష్టించిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి విగ్రహం సమీపంలో నూతనంగా ఆలయం నిర్మించనున్నట్లు వారు తెలిపారు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అన్న సత్రం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గౌడ కులస్తులతో పాటు గ్రామానికి చెందిన గౌడ గీత పారిశ్రామిక సంఘ సభ్యులతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


No comments:

Post a Comment