Thursday, 15 February 2024

శ్రీ మేధా హై స్కూల్ లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

 ధర్పల్లి మండల కేంద్రంలో శ్రీ మేధా హైస్కూల్లో వసంత పంచమి పర్వదినం వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ మదన్ సురేష్ మాట్లాడుతూ వసంత పంచమి పర్వదినం సందర్భంగా పాఠశాలలో మొదటగా సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు అనంతరం నూతన విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఉచితంగా అక్షరాభ్యాసం నిర్వహించి ఉచితంగా అడ్మిషన్లు అందించారు విద్యార్థిని విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సంపాదించి ప్రయోజకులు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ మేధా కరస్పాండెంట్ మదన్ సురేష్ ప్రిన్సిపాల్ జయ రెడ్డి ఉపాధ్యాయులు అరవింద్ రమాదేవి అశ్విని శృతి సోనీ స్రవంతి అనీషా రసజ్ఞ జ్యోతి మాధవి రిషిక మౌనిక కీర్తన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు




No comments:

Post a Comment