ఎల్లారెడ్డి మండలంలోని మౌలాన్ ఖేడ్ గ్రామ శివారులోని వీరభద్రుని ఆలయం వద్ద గురువారం ఉదయం అగ్ని గుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు అగ్ని గుండాల వద్ద ఆలయ పూజారి సంగమేశ్వరప్ప ఆధ్వర్యంలో పూజలు నిర్వహించగా భక్తులు తలస్నానం చేసి తడి బట్టలతో అగ్నిగుండాలను దాటారు వీరభద్రుని నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి కార్యక్రమంలో హనుమంతప్ప గురుస్వామి చెన్న సతీష్ చిన్న లక్ష్మణ్ ఎల్లారెడ్డి మౌలాన్ ఖేడ్ గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు
No comments:
Post a Comment